హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020: ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్ రేసులో జియో, పతాంజలి!!

IPL 2020: ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్ రేసులో జియో, పతాంజలి!!

jio pathanjali

jio pathanjali

వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్స్‌ర్ నుంచి తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. స్పాన్సర్ రేసులో జియో,పతాంజలి ఉన్నట్లు తెలుస్తోంది.

వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్స్‌ర్ నుంచి తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. స్పాన్సర్ రేసులో జియో,పతాంజలి ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో స్ఫాన్సర్‌ని వెతికి పట్టుకునే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. చైనా,భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా భారతీయ కంపెనీలనే స్పాన్సర్‌గా నియమించుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.

వివోతో ఓప్పందం

2018-2022 వరకు దాదాపు ఐదేళ్ల పాటు ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున వివో ఒప్పందం కుదుర్చుకుంది. రెండెళ్ళుగా వివో ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్వవహరిచింది. ఇటీవల గల్వాన్‌ లోయలో చైనా, ఇండియా సైనికుల మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో భారత సైనికులు వీరమరణం పొందారు. దీంతో భారత ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్వక్తం చేశారు. #chinabycot పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం మెుదలుపెట్టారు. ఈ సమయంలోనే చైనాకి చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలోనే 'వివో'తో జత కట్టడంపై కొందరు బహిరంగంగా బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టారు. పెద్ద సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్డారు. ఈ ఆగ్రహాన్ని గ్రహించిన వివో ఇండియా స్పాన్సర్ నుంచి తప్పుకున్నారు.

స్పాన్సర్ రేసులో జియో, పతాంజలి


ఇక కొత్త స్పాన్సర్‌ రేసులో జియో, పతాంజలి పేర్లు వినిపిస్తున్నాయి. భారత్‌కి చెందిన కంపెనీలనే స్పాన్సర్‌గా ఉండాలని అభిమానులు బీసీసీఐకి సూచిస్తు్న్నారు. వివోలా కొత్త టైటిల్ స్పాన్సర్ బీసీసీఐకి పెద్ద మెుత్తంలో చేల్లించే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఒకటి లేదా రెండు సంవత్సరాలకు 250 లేదా 300 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.

First published:

Tags: IPL, Jio, Patanjali, Vivo

ఉత్తమ కథలు