Home /News /ipl /

IS IPL MORE IMPORTANT TO ROHIT SHARMA THAN PLAYING FOR INDIA DILIP VENGSARKAR QUESTIONS BCCI SA

రోహిత్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా?.. నెక్స్ట్ మ్యాచ్ హిట్ మ్యాన్ ఆడుతాడా!

కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ (BCCI/ Twitter )

కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ (BCCI/ Twitter )

ఇండియన్ క్రికెట్‌లో  ఇప్పుడు రోహిత్ పేరు హట్‌టాఫిక్‌గా మారింది. పంజాబ్‌లో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రోహిత్.. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నారు.



    ఇండియన్ క్రికెట్‌లో  ఇప్పుడు రోహిత్ పేరు హట్‌టాఫిక్‌గా మారింది. పంజాబ్‌లో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రోహిత్.. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నారు. అంతలోనే ఆసీస్ టూర్ వెళ్లి జట్టును ప్రకటించడం... అందులో రోహిత్ పేరు లేకపోవడం.. అతి కాస్త పెద్ద చర్చనీయాంశంగా మారిపోవడం వంటి పరిణామాలు చకచక జరిగాయి. కావాలనే రోహిత్‌ను పక్కన పెట్టారని అభిమానులు,సీనియర్ క్రికెటర్స్ అభిప్రాయపడ్డారు. బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై వివరణ ఇచ్చిన బీసీసీఐ.. ఫిజియోథెరపి రిపోర్ట్‌లో ఫిట్‌గా లేడని తేలడంతోనే అతన్ని ఆస్ట్రేలియా టూర్ ఎంపిక చేయలేదని వెల్లడించింది.

    అంతలోనే సన్‌రైజర్స్,ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగాడు. దీంతో ఈ విషయం మరింత వివాదంగా మారింది. రోహిత్‌ శర్మ గాయమున్నా ఆ మ్యాచ్‌లో ఆడాడా.. లేక ఫిట్‌నెస్‌ను అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో విఫలమయ్యాడా..? అనేది స్పష్టత రావడం లేదు. ఈ విషయంపై సీనియర్ క్రికెటర్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. రోహిత్ గాయమున్నా మ్యాచ్‌లోకి దిగాడని తేలితే బీసీసీఐ చర్యలు ఏంటో.. అని మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించాడు.  "రోహిత్‌శర్మ ఫిట్‌గా లేడంటూ ఫిజియో నితిన్‌ పటేల్‌ బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో తెలిపాడు. ఈ కారణంగా అతన్ని ఆస్ట్రేలియా పర్యటనలో ఎంపిక చేయలేదు. కానీ రోహిత్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అయితే అతనికి ఆసీస్ పర్యటన ముఖ్యమా లేక ఐపీఎల్‌లా అనేది తెలియాలన్నాడు. నిజంగానే అతను ఫిట్‌గా లేడా లేకా..బీసీసీఐ ఫిజయో విఫలమయ్యాడా?’’ అంటూ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డారు"

    ఇక సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ ఆ మ్యాచ్‌లో బరిలోకి టీమ్‌ఇండియాకు శుభాపరిణామం అన్నారు. రోహిత్ గాయంపై ఇప్పటివరకు జరిగిన చర్చను పక్కనపెడితే.. అతను ఫిట్‌గా ఉండటం టీమిండియాకు కలుసోచ్చే అంశం. అతను ఫిట్ లేకుండా బరిలోకి దిగితే గాయం ఎక్కువైతుందని అందరూ ఆందోళనలో ఉన్నారు. రోహిత్ మాత్రం కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. ఆ అత్మవిశ్వాసంతోనే రోహిత్‌ మ్యాచ్‌ ఆడాడు’’ అని గవాస్కర్ తెలిపారు.

    ఇక హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ  7 బంతుల్లో 4 చేసి విఫలమయ్యాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Bcci, IPL 2020, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు