Rekulapally SaichandRekulapally Saichand
Updated: August 5, 2020, 2:02 PM IST
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ (Image:Cricket World Cup/Twitter)
ప్రంపచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను పసికూన ఐర్లాండ్ ఓడించింది. చిన్న పాటునైనా పెద్ద కర్ర కొట్లాలి అనే సూత్రాన్ని మరిచిపోయి ప్రత్యర్థి జట్టును లైట్ తీసుకుంది. దీంతో ఇంగ్లీష్ టీం భారీ మూల్యం చెల్లించికోవాల్సి వచ్చింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే ఐర్లాండ్ ఛేదించింది. టాప్ఆర్డర్ బ్యాట్స్‌మన్ పాల్ స్టిర్లింగ్(142; 128 బంతుల్లో 9x4, 6x6), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ(113; 112 బంతుల్లో 12x4) సెంచరీలతో చెలరెగి జట్టుకు విజయాన్ని అందించారు.
మెుదటిగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ఆది నుంచి ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. క్రమంగా వికెట్లు ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఇయాన్ మోర్గాన్(106; 84 బంతుల్లో 15x4, 4x6), టామ్ బాంటన్(58; 51 బంతుల్లో 6x4, 1x6), విల్లీ(51; 42 బంతుల్లో 3x4, 3x6) పరుగులతో రాణించారు. 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఇంగ్లీష్ జట్టు అలౌటైంది. అంతకుముందు మ్యాచ్‌ల్లో ఓడిన ఐర్లాండ్ చివరి మ్యాచ్‌లో తాడోపెడో తెల్చుకోవాడనికి సిద్దమై ఇంగ్లీష్ జట్టను గడగడలాడించింది. 328 పరుగుల లక్ష్యాన్ని ఉదేసింది. అంతకుముందు జరిగిన తొలి రెండు వన్డేల్లో ఇంగ్లాండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ ఇంగ్లీష్ జట్టు వంశమైంది.
Published by:
Rekulapally Saichand
First published:
August 5, 2020, 1:48 PM IST