ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: రబ్బర్ డక్‌ సౌండ్‌తో ఐపీఎల్ థీమ్ సాంగ్.. అసలు సీక్రెట్ ఇదేనా?

IPL 2020: ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్ థీమ్ సాంగ్‌ సీక్రెట్‌ను మ్యూజిక్ కంపోజర్ మయూర్ జుమాని బయటపెట్టాడు. చాలా ఈజీగా థీమ్ సాంగ్‌ కంపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

news18-telugu
Updated: October 22, 2020, 8:50 PM IST
IPL 2020: రబ్బర్ డక్‌ సౌండ్‌తో ఐపీఎల్ థీమ్ సాంగ్.. అసలు సీక్రెట్ ఇదేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీని క్రికెట్ ఫ్యాన్స్ పండగలా ఆస్వాదిస్తున్నారు. కొత్తకొత్త ట్విస్ట్‌లు.. సూపర్ ఓవర్ మ్యాజిక్‌లతో.. గతానికి మంచిన వినోదాన్ని అందిస్తోంది ఈ సీజన్. ఐతే ఐపీఎల్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. థీమ్ సాంగ్‌కు అంతకు మించిన అభిమానులు ఉన్నారు. ఆ పాట వినబడితే చాలు.. వారిలో తెలియని జోష్ వస్తుంది. ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు థీమ్ వినబడినా.. గ్రౌండ్ హోరెత్తిపోతోంది. స్టెప్పులతో స్టేడియం ఊగిపోతుంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఊర్రూతలూగుతారు. కరోన కారణంగా ప్రస్తుతం గ్రౌండ్‌లో మ్యాచ్ వీక్షించే అవకాశం లేకపోయినప్పటికీ.. టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పొట్టి క్రికెట్ ఫ్యాన్స్. థీమ్ సాంగ్ వినబడినప్పుడల్లా టీవీల ముందే స్టెప్పులేస్తున్నారు.

ఇలా కొన్నేళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తోంది ఐపీఎల్ థీమ్ సాంగ్. ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ థీమ్ సాంగ్‌ సీక్రెట్‌ను మ్యూజిక్ కంపోజర్ మయూర్ జుమాని బయటపెట్టాడు. చాలా ఈజీగా థీమ్ సాంగ్‌ కంపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కేవలం ఒక రబ్బర్ డక్‌ని తీసుకొని.. దాని సౌండ్‌తోనే సాంగ్‌ని కంపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అతడి వీడియో చూసిన ఐపీఎల్ ఫ్యాన్స్.. ఏంటి..? థీమ్ సాంగ్‌ని ఇంత ఈజీగా కంపోజ్ చేశారా? అని షాక్ తింటున్నారు.




ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లు జరిగాయి. మరో 16 మ్యాచ్‌లు జరిగితే లీగ్ దశ పూర్తవుతుంది. కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని యూఏఈ వేదికగా చాలా పకడ్బందీగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రెండో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స జట్టు ఆరు పాయింట్లతో అట్టడుగున నిలిచింది.
Published by: Shiva Kumar Addula
First published: October 22, 2020, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading