స్టార్ హోటల్స్ వద్దు.. ఆటగాళ్ల కొత్త డిమాండ్లు


Updated: August 6, 2020, 7:38 PM IST
స్టార్ హోటల్స్ వద్దు.. ఆటగాళ్ల కొత్త డిమాండ్లు
ఐపీఎల్ 2020లో చైనీస్ కంపెనీ స్పాన్సర్లను యధావిధిగా కొనసాగించాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.
  • Share this:
ఐపీఎల్ ఈవెంట్ జరిగే వేదికైతే ఖరారైంది కానీ అనేక సమస్యలు బీసీసీఐని వెంటాడుతున్నాయి. ప్రాంఛైజీలు,ఆటగాళ్ళు,స్పాన్సర్లు నుంచి బోర్డుకు ఇబ్బందులు ఎదురవుతునే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి నుంచి ఆటగాళ్ళను ఎలా రక్షించాలనే విషయంపై బీసీసీఐ తలపట్టుకుంటుంది. ఆటగాళ్ళ వసతిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. సాధరణంగా స్టార్ హోటళ్లలలో వసతి కల్పించడం అనవాయితిగా వస్తుంది. అయితే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను ఆటగాళ్ల కోరుకోవడం లేదు.

కరోనా నేపథ్యంలో వారిని కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా హోటల్‌ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్‌ కండిషనింగ్‌ డక్ట్‌లపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో నెలకొంది. సాధరణంగా హోటళ్ళలలో అనేక మంది పర్యటకులు, ఇతర అతిథులు ఉండే తాము ఉండడం అంతా శేయస్కారం కాదని వారు భావిస్తు్న్నారు. దీంతో అపార్ట్‌మెంట్‌ మొత్తాన్ని ఆటగాళ్ల కోసమే అద్దెకు తీసుకోవాలనే ఆలోచనతో వివిధ ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

అలాగే ప్లేయర్స్ తీసుకునే ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రాంఛైజీలు బీసీసీఐ తెలిపాయి. ఆహారం చేతులు మారకుండా ‘కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ’ ఉండాలని సూచిస్తున్నాయి. దాదాపు 80 రోజులు కుటుంబాలను విడిచిపెట్టి ఆటగాళ్ళు ఉండడం కష్టమని కావున పరిమిత సంఖ్యలో ఫ్యామిలీ మెంబర్స్‌ను అనుమతించాలని బీసీసీఐని జట్టు యాజమాన్యాలు కోరుతున్నాయి.
Published by: Rekulapally Saichand
First published: August 6, 2020, 7:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading