IPL 2020: ఐపీఎల్‌కు అంతా ఓకే.. ఆ ఒక్క అనుమతి కోసమే వెయిటింగ్

కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ ఎట్టికేలకు ప్రారంభం కానుంది. భారత్‌లో కరోనా విజృభిస్తున్న కారణంగా ఈవెంట్‌ను యూఏఈకు తరలించారు. టోర్నీకి సంబంధించిన సన్నహాలు మెుదలయ్యాయి.

Rekulapally Saichand
Updated: July 27, 2020, 7:18 PM IST
IPL 2020: ఐపీఎల్‌కు అంతా ఓకే..  ఆ ఒక్క అనుమతి కోసమే వెయిటింగ్
ఐపీఎల్ ట్రోఫి
  • Share this:
కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ ఎట్టికేలకు ప్రారంభం కానుంది. భారత్‌లో కరోనా విజృభిస్తున్న కారణంగా ఈవెంట్‌ను యూఏఈకు తరలించారు. టోర్నీకి సంబంధించిన సన్నహాలు మెుదలయ్యాయి. ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ప్రభుత్వం నుంచి అమోదం లభించింది. అసియా కప్,టీ20 వరల్డ్ కప్ వాయిదా పడడంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగుగమైంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఈవెంట్ నిర్వహణకు ముందుకు రావడంతో బీసీసీఐ పని మరింత సులువైంది. ఇక మిగిలింది భారత ప్రభుత్వం ఆమోదం.

తాజాగా ఐపీఎల్ నిర్వహణపై ఈసీబీ జనరల్‌ సెక్రటరీ ముబాషిర్‌ ఉస్మాని మీడియాతో మాట్లాడారు. "టోర్నీ జరపడం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంది. అధికార యంత్రంగాన్ని సమకూర్చుకోవాలి. ఈవెంట్ జరిగే షార్జా, అబుదాబి, దుబాయ్‌లో పోలీసు బలగాల అప్రమత్తం చేయాలి. వైద్య,ఆరోగ్యశాఖల సహాయ సహకారాలను వాడుకుంటాం. ఏలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా టోర్నీ నిర్వహిస్తామన్నారు"ముబాషిర్‌

ఐపీఎల్‌ తొలుత మార్చి 29నే జరాగాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా ఈవెంట్ వాయిదా పడుతూ వచ్చి్ంది. దీంతో అనుకున్న సమయానికి టోర్నీ నిర్వహణ కుదరలేదు. ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాలని తలచిన బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలించారు.
Published by: Rekulapally Saichand
First published: July 27, 2020, 7:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading