news18-telugu
Updated: October 24, 2020, 4:41 PM IST
ఎంఎస్ ధోని(MS Dhoni)
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీపై మాజీలు, నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత చెత్త ప్రదర్శనా..అని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఐతే శుక్రవారం షార్జా వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు ధోనీ. జాదవ్, పీయుష్ చావ్లాను పక్కనబెట్టి.. రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్‌ను జట్టులోకి తీసుకున్నాడు. ఐతే వారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ మ్యాచ్‌ల్లో చెన్నై ఘోర పరాజయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
''ముంబై జట్టు చేతిలో ఓటమి చెన్నై జట్టును చాలా కాలం బాధిస్తుంది. కుర్రాళ్లకు అవకాశమిస్తే.. వాళ్లు మరోసారి విఫలమయ్యారు. ధోనీని మరింత నిరూత్సహానికి గురిచేశారు. ఎంతో నమ్మి ఛాన్స్ ఇస్తే నిండా ముంచారని ధోనీ బాధ పడే అవకాశముంది.'' అని సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీలో కూడా.. ఒకింత నిరుత్సాహం కనిపించింది. ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని మనం ఆలోచించలేం. మనసులో బాధ ఉన్నా చిరునవ్వుతో చిందించేందుకు ప్రయత్నించలని అని చెప్పాడు ధోనీ. కుర్రాళ్లు బాగా ఆడేందుకు ప్రయత్నించారని అన్నాడు.
శుక్రవారం ముంబై జట్టుకు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఘోరంగా ఓడిపోయింది చెన్నై టీమ్. ఇటు బౌలింగ్.. అటు బ్యాటింగ్‌లో.. చెత్త ప్రదర్శనతో.. 10 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సూపర్ కింగ్స్ అభిమానులు ఆశలు అడియాశలయ్యాయి. కాగా, లీగ్ దశలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. కేవలం మూడు మ్యాచ్‌లు గెలిచింది. మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.
ా, షార్జాలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో ముంబై టీమ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. బోల్ట్, బుమ్రా దెబ్బకు చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలింది. సామ్ కరన్ 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో బోల్ట్‌కు 4 వికెట్లు దక్కాయి. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు, కౌల్టర్‌నైల్ ఒక వికెట్ సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు.. 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (46), ఇషాన్ కిషన్ (68) ఇద్దరే గెలిపించారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు చెన్నై జట్టు అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
Published by:
Shiva Kumar Addula
First published:
October 24, 2020, 4:18 PM IST