ఐపీఎల్ 2020

  • associate partner

IPL Betting: చిత్ర విచిత్రంగా ఐపీఎల్ బెట్టింగ్ లు.. ఛిద్రమవుతున్న బతుకులు

IPL Betting:చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్ లు మొదలు కావడంతో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇన్నాళ్లు ప్లేయర్ ఆటపైనే సాగిన బెట్టింగ్.. ఇప్పుడు చిత్ర విచిత్రంగా మారింది. ఆటగాడు ఏ కూల్ డ్రింక్ తాగుతాడు?.. అసలు తాగుతాడా? తాగడా? అంటూ పందేలు కాస్తూ కొందరు పైసలు వెనకేసుకుంటున్నారు. ఈ మోజులో పడ్డ అనేక మంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: September 25, 2020, 2:38 PM IST
IPL Betting: చిత్ర విచిత్రంగా ఐపీఎల్ బెట్టింగ్ లు.. ఛిద్రమవుతున్న బతుకులు
ఐపీఎల్ కప్ పాత చిత్రం
  • Share this:
ఐపీఎల్.. చాలా రోజుల తర్వాత క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. అయితే ఈ నేపథ్యంలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ మాత్రం అనేక మందిలో చీకట్లను నింపుతోంది. పందెం రాయుళ్లకు పైసల వర్షం కురిపిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆరునెలల పాటు క్రికెట్ మ్యాచ్ లు నిలిచి పోయాయి. దీంతో పందెం రాయుళ్లకు పనిలేకుండా పోవడంతో వారంతా విలవిలలాడిపోయారు.

అయితే ఇటీవల మొదలైన ఐపీఎల్ మ్యాచ్ లు పందెరాయుళ్ళకు మళ్లీ ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. ఒక ప్లేయర్ బాల్ కి ఎన్ని పరుగులు కొడతాడు? ఓవర్ లో ఎన్ని ఫోర్లు కొడతాడు? సిక్సర్ కొడతాడా? ఫోర్ కొడతాడా లేక ఈ బాల్ కి ఔట్ అవుతాడా? అంటూ పందేలు కాస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా మరీ విచిత్రంగా బ్యాట్స్ మెన్ బ్రేక్ లో కూల్ డ్రింక్ తాగుతాడా? తాగితే ఏ కంపెనీ కూల్ డ్రింక్ తాగుతాడు? వాటర్ మాత్రమే తాగుతాడా? అస్సలు ఏమీ తాగడా? అంటూ సైతం పందేలు కాస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ల తో ఎక్కడికీ వెళ్లకుండానే ఉన్న చోటు నుంచే యువత విచ్చల విడిగా పందేలు కాస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివిధ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ల పుణ్యమా అని డబ్బులు చాలా సులభంగా, క్షణాల్లో చేతులు మారుతున్నాయి.
దీంతో క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి ఎందరో యువకులు, మధ్య తరగతి ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉన్నందంతా పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. వీరి వ్యసనాన్ని ఆసరాగా చేసుకుంటున్న బుకీలు కోట్లలో డబ్బు పోగేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఈ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే అనేక మంది మోసపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
Published by: Nikhil Sangani
First published: September 25, 2020, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading