ఆర్సీబీ జట్టు నుంచి ఈ ఆటగాళ్ళు ఔట్.. 2021లో కొత్తగా బెంగళూర్ జట్టు?

2021లో మెగా వేలం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌సిబి జట్టు మెుత్తాన్ని ప్రక్షాళన చేస్తుందనే చర్చ జరిగింది.

2021లో మెగా వేలం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌సిబి జట్టు మెుత్తాన్ని ప్రక్షాళన చేస్తుందనే చర్చ జరిగింది.

  • Share this:
    ఆర్సీబీ యాజామాన్యం జట్టు ప్రక్షళనలకు సిద్దమైంది. ఐదుగురు ఆటగాళ్లపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2020లో జట్టు పదర్శనను ప్రమాణికంగా తీసుకుని తగిన మార్పులకు శ్రీకారం చుట్టనుంది


    2021లో మెగా వేలం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌సిబి జట్టు మెుత్తాన్ని ప్రక్షాళన చేస్తుందనే చర్చ జరిగింది.


    ఈ మార్పులపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. " ఆర్‌సిబి జట్టు బాగుంది. కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. మొత్తం జట్టును మార్చాల్సిన అవసరం లేదు" అన్నారు


    IPL 2020 Live Score, SRH vs RCB Eliminator, Today's Match at Abu Dhabi: In-Form SRH Look for 2016 Repeat
    ఒక్కవేళ జట్టులో మార్పులు చేయాల్సి వస్తే ఈ విధంగా ఉండవచ్చన్నారు,


    ఈ ఐపీఎల్‌లో కన్నడిగ దేవదత్ పాడికల్ అద్భుతంగా ప్రదర్శనను ఇచ్చాడు. తొలి సీజన్‌లో ఏ ఆటగాడు ఇంతటి ప్రదర్శన ఇవ్వలేదన్నారు ఆకాష్ చోప్రా. కావున దేవదత్ జట్టులో కొనసాగే అవకాశం ఉందన్నారు.


    ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ ఆర్‌ సిబి జట్టులో అశించిన స్థాయిలో రాణించలేదన్నారు చోప్రా . కావున అతన్ని వదిలివేయడం మంచిదని పరోక్షంగా పేర్కొన్నారు.


    మరో ఆటగాడు జాషువా ఫిలిప్ అనుభవం తక్కువని.. అతను మంచి ప్రదర్శన ఆశించలేమన్నారు, అందువల్ల ఎక్కువ హైప్ ఇవ్వవలసిన అవసరం లేదని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. అతన్ని మార్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.


    ఇచ్చిన అవకాశాలను మొయిన్ అలీ ఉపయోగించుకోలేదు. అతనిపై అర్సీబీ జట్టు అభిప్రాయం ఎంటో తెలియదంటూ పరోక్షంగా అతన్ని వదిలేయం మంచిదనే సంకేతాలు ఇచ్చారు.


    ఈ సీజన్ ఐపిఎల్‌లో ఆర్‌సిబికి క్రిస్ మోరిస్ వరంగా అలాగే శాపంలా మారాడన్నారు ఆకాష్. క్రిస్ మోరిస్ మొదట్లో గాయంతో బాధపడ్డాడు. మధ్యలో జట్టులోకి తిరిగివచ్చి మంచి ప్రదర్శన కనబరిచారు. చివరికి గాయం సమస్యతో జట్టుకు దూరమయ్యాడు. దీని వల్ల ఆర్సీబీ జట్టుపై ప్రభావం పడిందన్నారు


    IPL 2020: Only 3 match left for RCB Bangalore: What Virat Kohli team should do to get into the playoffs; here is the details
    ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని, అతనిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని కొందరు మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ జట్టుకు టైటిల్ అందించడంలో విఫలమవుతున్నారు. కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతాల నుంచి తప్పించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడుతున్నారు. 2021 వేలం జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. వీలైతే జట్టు మెుత్తాన్ని మార్చే యోచనలో బెంగళూర్ యాజామాన్యం ఉంది. వచ్చే ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు కొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
    Published by:Rekulapally Saichand
    First published: