Home /News /ipl /

IPL 2022 IPL UPDATES DELHI CAPITALS PREVIEW FULL SQUAD RECORDS PREDICTED PLAYING XI FOR IPL 2022 SEASON SJN

IPL 2022: రిషభ్ పంత్ నాయకత్వంలో ఈసారైనా ఢిల్లీ గర్జించేనా... డేవిడ్ బాయ్ మాయ చేసేనా..?

ఢిల్లీ క్యాపిటల్స్ టీం

ఢిల్లీ క్యాపిటల్స్ టీం

IPL 2022: బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అత్యంత బలమైన కోర్ టీమ్ కలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెగా ఆక్షన్ పుణ్యమా? చెల్లా చెదురైంది. కొత్తగా రెండు జట్లు రావడం.. మెగా ఆక్షన్ కండీషన్స్‌తో తమ స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయినా వారికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకుంది.

ఇంకా చదవండి ...
ఐపీఎల్ (IPL) చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అసలు 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాలు కూడా లేవు.. ఎందుకంటే అంతకుముందు 6 సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ 2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2021 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ టేబుల్ టాపర్‌గా నిలిచింది. కానీ అదృష్టం కలిసిరాక ఫైనల్ చేరలేకపోయింది. కనీసం ఈ సారైన ఆ కలను నెరవేర్చుకోవాలని రిషభ్ పంత్ (Rishabh Pant) సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అత్యంత బలమైన కోర్ టీమ్ కలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెగా ఆక్షన్ పుణ్యమా? చెల్లా చెదురైంది. కొత్తగా రెండు జట్లు రావడం.. మెగా ఆక్షన్ కండీషన్స్‌తో తమ స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయినా వారికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకుంది. ముఖ్యంగా మెగా వేలంలో ఇతర జట్ల కన్నా దూకుడుగా కనిపించింది. పర్స్ మనీ తక్కువగా ఉండటంతో ఆ జట్టు తమ బడ్జెట్‌‌‌ను చూసుకుంటూ ప్రతీ ఆటగాడికి బిడ్ వేసింది. ముఖ్యంగా ఆ జట్టు కో ఓనర్, తెలుగువాడైన కిరణ్ కుమార్ గ్రాంధీ వేలంలో చాలా చురుకుగా వ్యవహరించాడు. దాంతో అందుబాటులో ఉన్న వనరులతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన జట్టును ఎంచుకుంది.

బ్యాటింగే బలం

ఢిల్లీ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగున్నప్పటికీ గత సీజన్ మాదిరి టాప్ క్వాలిటీ పేస్, స్పిన్ బౌలర్లు మాత్రం లేరు. కానీ ఉన్న వనరుల్లో ఢిల్లీ ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకుంది. శిఖర్ ధావన్ స్థానంలో ఐపీఎల్‌కే బ్రాండ్ అంబాసిడర్ అయిన డేవిడ్ వార్నర్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్ స్థానాన్ని మిచెల్ మార్ష్‌తో, ఆవేశ్ ఖాన్ ప్లేస్‌ను చేతన్ సకారియా, హెట్‌మైర్ ప్లేస్‌ను రోమన్ పోవెల్‌తో భర్తీ చేసింది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో పోవెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రబడా వంటి టాప్ క్లాస్ బౌలర్ మిస్ అయినా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగి ఎంగిడి వంటి బౌలర్లతో అతని స్థానాన్ని భర్తీ చేసింది.

భయపెడుతోన్న నోర్జే గాయం

కీలక ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే గాయం ఢిల్లీని కలవరపెడుతోంది. గత రెండు సీజన్లలో ఆ జట్టు విజయాల్ల ోనోర్జే కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే అతడు ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. తొలుత సీజన్ నుంచి తప్పుకున్నట్లు కనిపించినా... ఆ తర్వాత నోర్జే తన సతీమణితో కలిసి ముంబై లో అడుగు పెట్టాడు. ఆరంభ మ్యాచ్ లకు అతడు దూరమైనా లీగ్ ఆఖర్లో అందుబాటులోకి వస్తాడని ఢిల్లీ మేనేజ్ మెంట్ ఆశాభావంగా ఉంది.

ఢిల్లీ పూర్తి జట్టు
రిషభ్ పంత్(రూ.16 కోట్లు), అక్షర్ పటేల్(రూ.9 కోట్లు), పృథ్వీ షా(రూ.7.5 కోట్లు), అన్రిచో నోర్జ్(రూ.6.5 కోట్లు), డేవిడ్ వార్నర్(రూ.6.25 కోట్లు), మిచెల్ మార్ష్(రూ.6.5 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్(రూ.2 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ.10.75 కోట్లు), కుల్దీప్ యాదవ్(రూ.2 కోట్లు), అశ్విన్ హెబ్బర్ (రూ.20 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్(రూ.20 లక్షలు), కమలేశ్ నాగర్‌కోటి(రూ. కోటి 10 లక్షలు), కేఎస్ భరత్ (రూ.2 కోట్లు), మన్‌దీప్ సింగ్(రూ కోటి 10 లక్షలు), సయ్యద్ ఖలీల్ అహ్మద్(రూ.5.25 కోట్లు), లుంగి ఎంగిడి(రూ.50 లక్షలు), చేతన్ సకారియా(రూ.4.2 కోట్లు), యశ్ ధుల్(రూ.50 లక్షలు), విక్కీ ఓస్వాల్(రూ.20 లక్షలు), రిపాల్ పటేల్(రూ.20 లక్షలు), లలిత్ యాదవ్(రూ.65 లక్షలు), రోమన్ పోవెల్(రూ.2.8 కోట్లు), టీమ్ సీఫెర్ట్(రూ.50 లక్షలు), ప్రవీణ్ దుబే(రూ.50 లక్షలు)
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Delhi Capitals, IPL, IPL 2022, Rishabh Pant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు