IPL 2021 WILL BE IN INDIA IN APRIL MAY MONTH SAYS BCCI PRESIDENT SOURAV GANGULY SK
IPL 2021: వచ్చే ఏడాది ఐపీఎల్ అప్పుడే... బీసీసీఐ కీలక ప్రకటన
వాస్తవానికి ఐపీఎల్ 2020 టోర్నీ మార్చి నెలఖారు నుంచి ఇండియాలోనే జరగాల్సి ఉంది. కరోనా కారణంగా టోర్నీని దాదాపు 6 నెలలు వాయిదా వేయడంతో పాటు వేదికను కూడా యూఏఈకి మార్చారు.
వాస్తవానికి ఐపీఎల్ 2020 టోర్నీ మార్చి నెలఖారు నుంచి ఇండియాలోనే జరగాల్సి ఉంది. కరోనా కారణంగా టోర్నీని దాదాపు 6 నెలలు వాయిదా వేయడంతో పాటు వేదికను కూడా యూఏఈకి మార్చారు.
ఐపీఎల్ 2020 టోర్నీ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ సీజన్లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబరు 8న క్వాలిఫైయర్-2, 10న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐతే అంతలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ (2020 సీజన్)పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్, మే నెలల్లో భారత్ వేదికగానే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు. ఐపీఎల్ 2020 కోసం మాత్రమే యూఏఈని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఇండియా టుడే ఇన్స్పిరేషన్ లేటెస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్న సౌరభ్ గంగూలీ రాబోయే ఐపీఎల్‌పై పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. '' ఏప్రిల్, మే నెలల్లో మరో ఐపీఎల్ (ఐపీఎల్ 2021) ఉంటుంది. కేవలం ఐపీఎల్-2020 కోసం మాత్రమే యూఏఈని ఎంచుకున్నాం. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఇండియా ఆతిథ్యమిస్తుంది. భారత్‌లోనే దేశవాలీ టోర్నీలు నిర్వహిస్తాం. రంజీ ట్రోఫీ కోసం బయో బబుల్‌ను ఏర్పాటు చేస్తాం. గోవాలో నవంబర్ నుంచి ISL ప్రారంభకాబోతోంది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు. ఐపీఎల్ ఎంతో మేల చేసింది. మే 16 సార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది.'' అని సౌరభ్ గంగూలీ పేర్కొన్నారు.
కాగా, వాస్తవానికి ఐపీఎల్ 2020 టోర్నీ మార్చి నెలఖారు నుంచి ఇండియాలోనే జరగాల్సి ఉంది. కరోనా కారణంగా టోర్నీని దాదాపు 6 నెలలు వాయిదా వేయడంతో పాటు వేదికను కూడా యూఏఈకి మార్చారు. బయో బబుల్ ఏర్పాటు చేసిన.. కరోనా నిబంధనల మధ్య విజయవంతంగా టోర్నీని నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశతో పాటు క్వాలిఫైయర్1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు కూడా పూర్తయ్యాయి. క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.