Home /News /ipl /

IPL 2020MUMBAI INDIANS BOLWER JASPRIT BUMRAH GETS NO 1 POSITION IN PURPLE CAP RACE SK

Jasprit Bumrah: బూమ్..బూమ్.. బుమ్రా.. పర్పుల్ క్యాప్‌ వచ్చేసింది..

బుమ్రా పర్పుల్ క్యాప్ (Image:Twitter)

బుమ్రా పర్పుల్ క్యాప్ (Image:Twitter)

Jasprit Bumrah: ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడాడు బుమ్రా. 52 ఓవర్లలో 362 పరుగులు ఇచ్చి 23 వికెట్లు తీశాడు.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబై ఇండియన్స్ పేసర్ జాస్ప్రిత్ బుమ్రా అదరగొడుతున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. అవసరమైన సమయంలో వికెట్లు తీస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు పర్పుల్ క్యాప్ రేస్‌లోనూ టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీసి.. టాప్‌లో ఉన్న రబాడను వెనక్కి నెట్టాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు బుమ్రా. రిషబ్ పంత్, స్టోయినిస్, హర్షల్ పటేల్‌ను ఔట్ చేశాడు. తద్వారా ఈ టోర్నీలో ఇప్పటి వరకు బుమ్రా తీసిన వికెట్ల సంఖ్య 23కి చేరుకుంది. దాంతో పర్పుల్ క్యాప్ రేస్‌లో మొదటి ప్లేస్‌కు చేరుకున్నాడు.

    ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడాడు బుమ్రా. 52 ఓవర్లలో 362 పరుగులు ఇచ్చి 23 వికెట్లు తీశాడు. బుమ్రా తర్వాతి స్థానాల్లో కాగిసో రబాడ (23), ట్రెంట్ బోల్ట్ (20), మహమ్మద్ షమి (20), జోఫ్రా ఆర్చర్ (19) ఉన్నారు. బుమ్రా టాప్ ప్లేస్‌లోకి రావడంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బూమ్..బూమ్.. అంటూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు.




    POINTS TABLE:


    ORANGE CAP:

    కాగా, బుమ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌లు గెలిచి.. నాలుగింట ఓడిపోయింది. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్‌లు గెలిచి.. ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Jasprit Bumrah, Mumbai Indians

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు