ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: పంజాబ్‌ టీమ్‌పై సెహ్వాగ్ సెటైర్లు.. నవ్వు ఆపుకోలేరు..

IPL 2020: సెహ్వాగ్ భావించినట్లుగా.. క్రిస్ గేల్‌ను జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది కింగ్స్ ఎలెవన్ జట్టు. కాట్రెల్ స్థానంలో జోర్డాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: October 10, 2020, 4:33 PM IST
IPL 2020: పంజాబ్‌ టీమ్‌పై సెహ్వాగ్ సెటైర్లు.. నవ్వు ఆపుకోలేరు..
వీరేంద్ర సెహ్వాగ్
  • Share this:
IPL 2020: టీమిండిమా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాన్ సోషల్ మీడియాలో దూకుడు మీదున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షిస్తూ.. విశ్లేషిస్తూ..తన దైన స్టైల్లో స్పందిస్తున్నారు. బాగా ఆడే జట్టుపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. చెత్తగా ఆడుతున్న టీమ్‌లపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా కింగ్స్ ఎలెవన్ జట్టును టార్గెట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ఈ టోర్నీలో టీమ్ ప్రదర్శనపై జోకులు పేల్చారు. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్న కేఎల్ రాహుల్ సేనపై సానుభూతి చూపించారు. కనీసం వరల్డ్ బ్యాంక్ అయినా కనికరించి.. పంజాబ్ జట్టుకు రెండు పాయింట్లు ఇవ్వాలని సెటైర్ వేశారు వీరేంద్ర సెహ్వాగ్. వీరూకి బైటక్ 22వ ఎపిసోడ్‌లో భాగంగా ఇవాళ్టి మ్యాచ్‌పై వీరు విశ్లేషించారు.

''ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రపంచ బ్యాంకైనా కనికరించి రెండు పాయింట్లైనా ఇస్తే బాగుండు. బౌలింగ్ మాత్రమే సమస్య అని మొదట అనిపించింది. కానీ బ్యాటింగ్ పరిస్థితి కూడా అలాగే ఉందని ఆ తర్వాత కనువిప్పు కలిగింది. అసలు సమస్యంతా అక్కడే ఉంది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు యాపిల్ బుట్టలో నుంచి వచ్చిన వారే. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా క్రిస్ గేల్‌ని ఆడిస్తారని అనుకుంటున్నా. కోచ్ అనిల్ కుంబ్లే కనికరించి గేల్‌ను జట్టులోకి తీసుకుంటే కన్నుల పండగగా ఉంటుంది. మాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను తీసుకోవాలి. కాట్రెల్ స్థానంలో హార్డ్ విల్జోయెన్‌ను తీసుకోవాలి.'' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

ఐతే సెహ్వాగ్ భావించినట్లుగా.. క్రిస్ గేల్‌ను జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది కింగ్స్ ఎలెవన్ జట్టు. కాట్రెల్ స్థానంలో జోర్డాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాట్రెల్‌ను తప్పించి హార్డ్ విల్జోయెన్‌ను తీసుకోవాలని సెహ్వాగ్ సూచించగా.. పంజాబ్ మాత్రం జోర్డాన్‌కు అవకాశమిచ్చింది.

పంజాబ్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిని కింగ్స్ ఎలెవన్ జట్టు.. ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. మిగిలిన ఐదింటిలో ఓటమి పాలయింది. ఢిల్లీ, రాజస్థాన్, ముంబై, చెన్నై, హైదరాబాద్ జట్ల చేతిలో పరాజయం పాలైంది. కేవలం బెంగళూరు జట్టుపై మాత్రమే విజయం సాధించింది.
Published by: Shiva Kumar Addula
First published: October 10, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading