ఐపీఎల్ 2020

  • associate partner

RCB VS MI: కోహ్లిని ఊరిస్తున్న అరుదైనా రికార్డు.. ఈ మ్యాచ్‌లోనైనా సాధిస్తాడా?

ఐపీఎల్‌-13లో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ 85 పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల మార్కును దాటిన క్రికెటర్ రికార్డు సాధించనున్నాడు

news18-telugu
Updated: September 28, 2020, 8:19 PM IST
RCB VS MI: కోహ్లిని ఊరిస్తున్న అరుదైనా రికార్డు.. ఈ మ్యాచ్‌లోనైనా సాధిస్తాడా?
విరాట్ కోహ్లి(Virat Kohli)
  • Share this:











ఐపీఎల్‌-13లో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ 85 పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల మార్కును దాటిన క్రికెటర్ రికార్డు సాధించనున్నాడు. ఇప్పటివరకు 283 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 8, 915 పరుగులు చేశాడు. మరో 85 పరుగులు సాధిస్తే 9 వేల మార్కును అందుకోనున్న తొలి ఇండియన్ క్రికెటర్‌గా చరిత్రలో నిలుస్తాడు. క్రిస్‌ గేల్‌(13, 296) పరుగులతో మెుదటస్థానంలో ఉండగా, కీరోన్‌ పొలార్డ్‌(10, 238),బ్రెండన్‌ మెకల్లమ్‌(9,922),షోయబ్‌ మాలిక్‌(9,906),డేవిడ్‌ వార్నర్‌(9,318), అరోన్‌ ఫించ్‌(9,088) తర్వాతి స్ధానాల్లో నిలిచారు.

SCHEDULE TIME TABLE:

అయితే ఐపీఎల్ 2020లో కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులు చేయగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశారు.









 ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాప్ గెలిచిన ముంబై జట్టు  ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈ సారి ఎలాగైనా గెలిచి టైటిల్‌ రేసులో నిలవాలని చూస్తుంది. కోల్‌కత్తాపై గెలిచి మంచి ఊపు మీద ఉన్న ముంబై.. ఆర్సీబీపై గెలిచి మరో విజయాన్ని తన ఖాతాలో వెసుకోవాలని చూస్తుంది.

Published by: Rekulapally Saichand
First published: September 28, 2020, 8:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading