ఐపీఎల్ 2020

  • associate partner

Virat Kohli: తీరు మార్చుకోని కొహ్లీ.. మళ్లీ స్లెడ్జింగ్.. మనీష్ ఆన్సర్ అదుర్స్

IPL 2020: శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. కొహ్లీ సేనపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. క్వాలిఫైయర్-2లో అడుగుపెట్టింది.

news18-telugu
Updated: November 7, 2020, 6:02 PM IST
Virat Kohli: తీరు మార్చుకోని కొహ్లీ.. మళ్లీ స్లెడ్జింగ్.. మనీష్ ఆన్సర్ అదుర్స్
మనీష్ పాండే, విరాట్ కొహ్లీ (Image:Twitter)
  • Share this:
IPL 2020: ఐపీఎల్ టోర్నీ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలయింది. ఐతే ఆ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని స్లెడ్జింగ్ చేసిన కొహ్లీ.. హైదరాబాద్ జరిగిన మ్యాచ్‌లోనూ అలానే ప్రవర్తించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే వైపు చూసి నవ్వుతూ.. రెచ్చగొట్టాడు. అతడు ఇవాశ షాట్లు ఆడడులే అంటూ..వెటకారంగా మాట్లాడాడు.

సన్ రైజర్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ వేసిన ఆ ఓవర్‌లో మూడో బంతిని కవర్స్ వైపు తరలించాడు మనీష్ పాండే. అక్కడే ఉన్న మొయిన్ అలీ బంతిని అందుకొని కొహ్లీకి అందించాడు. బంతిని పట్టుకున్న కొహ్లీ.. మనీష్ పాండే వైపు చూస్తూ నవ్వాడు. ''బహుత్ బడియా. ఆజ్ నహీ మార్ రహా షాట్.. అచ్ఛా చలో. ( అతడు ఇవాళ షాట్స్ ఆడడం లేదు. బాగా వెయ్యి)'' అంటూ పాండేను ఉద్దేశించి సిరాజ్‌కు చెప్పాడు. ఆ మాటలు క్లియర్‌గా వినిపించాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఐతే కొహ్లీ మాటలతో కవ్వించిన కాసేపటికే మనీష్ పాండే ధీటుగా సమాధానం చెప్పాడు. అతడు స్లెడ్జ్ చేసిన తర్వాత ఒక బంతిని బీట్ చేసి.. నెక్ట్స్ బాల్‌ను భారీ సిక్స్ కొట్టాడు మనీష్. కొహ్లీకి సిక్స్‌ రూపంలో దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు కొహ్లీ తీరుపై మండిపడుతున్నారు. నువ్వు మారవా.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్తున్న టీమిండియాలో మనీష్ పాండే ఉన్నాడని.. డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోయే యువ ఆటగాడితో ఇలాగేనా ప్రవర్తించేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇటీవల జరిగిన బెంగళూరు, ముంబై మ్యాచ్‌లో సూర్యకుమార్‌ను కూడా కొహ్లీ సెడ్జింగ్ చేసిన విషయం తెలిసిందే. 13వ ఓవర్‌ పూర్తయ్యాక సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు చూస్తూ విరాట్ కొహ్లీ ముందుకెళ్లాడు. సూర్య కూడా అలాగే చూశాడు. సూర్య వెనకకు వెళ్లిన కొహ్లీ.. బంతిని రుద్దుతూ సూర్యకుమార్ వైపు కోపంగా చూశాడు. కొహ్లీ స్లెడ్జింగ్ చేసినా అతడు పట్టించుకోలేదు. అక్కడి నుంచి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. కొహ్లీ సేనపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. క్వాలిఫైయర్-2లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో మనీష్‌ పాండే 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 24 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టు నవంబరు 8న జరగనున్న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీని ఢీకొట్టనుంది. అందులో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. లేదంటే ఇంటికి చేరుకుంటుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 7, 2020, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading