news18-telugu
Updated: November 7, 2020, 10:59 AM IST
విరాట్ కోహ్లి(ఫైల్ ఫొటో)
ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం స్పందించిన కోహ్లి.. తాము బ్యాటింగ్‌లో తగినన్ని పరుగులు చేయలేదని అన్నాడు. హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెంచేలా తమ బ్యాటింగ్ లేదని చెప్పాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ సందర్భంగా కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను తాము చేజార్చకుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదన్నాడు. కాగా, హైదరాబాద్ జట్టు విజయంలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే హైదరాబాద్ జట్టు 16 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన సమయంలో కేన్ విలియమ్సన్ బాదిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పడిక్కల్ విఫలమయ్యాడు.
ఇంకా కోహ్లి మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్ సీజన్లో తమ జట్టు నుంచి దేవ్‌దత్ పడిక్కల్ తనలోని ట్యాలెంట్‌ను నిరూపించుకోవడానికి అవకాశం లభించిదన్నాడు. అతడు టోర్నిలో 400కు పైగా పరుగులు సాధించడాని.. అతి అంత సులభమైనదేమి కాదని చెప్పాడు. అలాగే మహ్మద్ సిరాజ్ మంచి పునరాగమనం లభించిందన్నారు. ఏబీ డివిలియర్స్ ఎప్పటికి జట్టుకు బలంగా నిలిచే ఆటగాడని పేర్కొన్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా జట్టు కోసం కష్టపడ్డారని.. కానీ అది సరిపోలేదని చెప్పాడు.
ఇక, ఈ మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ మాట్లాడుతూ.. తమ బౌలర్లు బాగా రాణించారని అన్నాడు. బౌలింగ్ చేసే సమయంలో రషీద్ ఖాన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. నటరాజన్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని కొనియాడాడు. కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ బ్యాంకర్‌గా పేర్కొన్నాడు. ఒత్తిడి సమయాల్లో కూడా విలియమ్సన్ మెరుగైన ఆట తీరు కనబరుస్తాడని వార్నర్ ప్రశంసలు కురిపించాడు.
ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ 56, ఫించ్ 32 పరుగులతో రాణించారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్.. శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లోనే శ్రీవత్స్ గోస్వామి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ మెరుగుపడుతున్న సమయంలో వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం తక్కువ వ్యవధిలోనే మనీశ్ పాండే, గార్గ్ కూడా ఔట్ కావడంతో.. హైదరాబాద్ విజయ అవకాశాలపై సందేహాలు తలెత్తాయి. అయితే విలియమ్సన్, హోల్డర్లు జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు.. 6వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published by:
Sumanth Kanukula
First published:
November 7, 2020, 10:59 AM IST