ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: మ్యాచ్‌కి ముందు జైస్వాల్‌‌‌కు ధోనీ ఆశీర్వాదం.. వీడియో వైరల్

చాలా మంది యువ క్రికెటర్లు వెలుగులోకి రావడానికి ఐపీఎల్ చక్కటి వేదికగా మారుతుంది. దాదాపు అన్ని ప్రాంఛైజీలు కొత్త కుర్రాళ్ళను తమ జట్టులోకి తీసుకున్నాయి.


Updated: September 22, 2020, 10:38 PM IST
IPL 2020: మ్యాచ్‌కి ముందు జైస్వాల్‌‌‌కు ధోనీ ఆశీర్వాదం.. వీడియో వైరల్
Dhoni- Yashasvi Jaiswal
  • Share this:
చాలా మంది యువ క్రికెటర్లు వెలుగులోకి రావడానికి ఐపీఎల్ చక్కటి వేదికగా మారుతుంది. దాదాపు అన్ని ప్రాంఛైజీలు కొత్త కుర్రాళ్ళను తమ జట్టులోకి తీసుకున్నాయి. తమ మ్యాచ్‌ల ద్వారా ఒక్కో జట్టు ఒక్కో యువ క్రికెటర్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. తాజాగా అండర్ -19 బ్యాట్స్ మెన్ జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులోకి తీసుకుంది. షార్జాలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్ధాన్ అతన్ని ఓపెనర్‌గా బరిలో దింపింది

అంతకుముందు జైస్వాల్‌ సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశీర్వాదం తీసుకున్నారు. టాస్‌కి వెళ్తున్న ధోనికి ఎదురెళ్ళి నమస్కరించి మహీ ఆశీస్సులకు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక యువ ఆటగాడి ప్రస్ధానం చూస్తే 2019 అండర్ -19 ప్రపంచ కప్‌లో భారీ హిట్టింగ్‌తో అందరి దృఫ్టిని ఆకర్షించాడు. సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై అజేయ సెంచరీతో సహా ఆరు ఇన్నింగ్స్‌లలో 400 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు.
ఐపీఎల్‌లోని గేమ్ 4 లో మంగళవారం సిఎస్‌కెతో అరంగేట్రం చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ జైస్వాల్ 1 బౌండరీతో కేవలం 6 పరుగులే చేసి నిరాశ పరిచాడు.
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 10:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading