ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 | ‘వీవో’ వైదొలగినందున నష్టం లేదు...ప్లాన్ బీ ఉంది: గంగూలీ

IPL 2020 updates | భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఆమోదంతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ నుంచి వీవో తప్పుకుంది. వీవో వైదొలగడంతో వచ్చిన నష్టమేమీ లేదని..తమకు ప్లాన్ బీ ఉందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు.

news18-telugu
Updated: August 9, 2020, 1:54 PM IST
IPL 2020 | ‘వీవో’ వైదొలగినందున నష్టం లేదు...ప్లాన్ బీ ఉంది: గంగూలీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఐపీఎస్ 2020పై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ ‘వీవో’తో (చైనా మొబైల్ తయారీ సంస్థ) బీసీసీఐ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వీవో స్థానంలో సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 టోర్నీకి కొత్త టైటిల్ స్పాన్సర్ల కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. అమెజాన్ టైటిల్ స్పాన్సర్ రేసులో ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘వీవో’ టైటిల్ స్పాన్సర్‌‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో బీసీసీఐ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ... ఐపీఎల్ నుంచి వీవో తప్పుకున్నంత మాత్రాన బీసీసీఐకి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. వీవో తప్పుకోవడాన్ని ఆర్థిక సంక్షోభంగా తాను చెప్పనని...తాత్కాలిక సమస్యేనని ఓ వెబినార్ కార్యక్రమంలో గంగూలీ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

rohit sharma, sourav ganguly news, 2003 worldcup india team, team india, virat kohli news, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ
గంగూలీ(File)


టైటిల్ స్పాన్సర్ వీవో ఐపీఎల్ వైదొలగడంతో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. బీసీసీఐకి గట్టి పునాధులున్నాయని, ఇలాంటి తాత్కాలిక సమస్యలను హ్యాండిల్ చేయగలదని అన్నారు. ఇలాంటి సమయాల్లో బీసీసీఐకి ప్లాన్ బీ కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. కొన్ని నిర్ణయాలు నష్టాలతో పాటు మరికొన్ని లాభాలను కూడా తీసుకొస్తుందని అన్నారు.

ఐపీఎల్ టోర్నీలో టైటిల్ స్పాన్సర్‌ ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. ఇందులో బీసీసీఐ సగం మొత్తాన్ని తీసుకుంటుండగా...మిగతా సగాన్ని 8 ఫ్రాంచైజీలు సరిసమానంగా పంచుకుంటున్నాయి. 2018 నుంచి 2022 మధ్య ఐదేళ్ల కాలానికి పీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం వీవో...బీసీసీఐకి రూ.2190 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. అంటే ఒక్కో ఐపీఎల్ టోర్నీ కోసం వీవో రూ.440 కోట్లు చెల్లిస్తోంది.

2021 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను బీసీసీఐ సొంతం చేసుకుందని..ఇందులో ఎలాంటి మార్పులు లేవని గంగూలీ తెలిపారు.
Published by: Janardhan V
First published: August 9, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading