IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రదర్శన ఆకట్టుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడినప్పటికీ.. క్వాలిఫైయర్-2 రూపంలో మరో అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ఫైనల్‌కు వెళ్లి మళ్లీ ముంబైని ఢీకొడుతుంది. ఐతే ఢిల్లీ బాగా రాణించినప్పటికీ ఓ పెద్ద తప్పు చేసిందని సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముంబై జట్టులో ఇరగదీస్తున్న పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ని వదులుకొని.. ట్రేడింగ్ ద్వారా ముంబైకి అప్పగించి.. పెద్ద తప్పు చేసిందని స్పష్టం చేశారు. బౌల్ట్ ఢిల్లీలోనే ఉంటే.. ఆ టీమ్ మరింత అద్భుతంగా రాణించేదని ఆయన తెలిపారు.
టామ్ మూడీ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ''అది అసాధారణమైన చర్య. ట్రేడింగ్ ద్వారా ట్రెంట్ బౌల్ట్‌ను ముంబైకు వదిలి వేయడం సరైన నిర్ణయం కాదు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్‌లో బౌల్ట్ కీలక బౌలర్‌గా మారిపోయాడు. యూఏఈలో టోర్నమెంట్ జరుగుతుందన్న విషయం తెలియక బౌల్ట్‌ను వదిలేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా ముంబై దొరికిన అద్భుతమైన ఒక గిఫ్ట్ బౌల్ట్. పవర్ ప్లేలో బౌల్ట్ అత్యుత్తమ బౌలర్. బలమైన జట్టుకు బౌల్ట్‌ను అప్పగించి ఢిల్లీ పెద్ద తప్పుచేసింది. ట్రేడింగ్ ద్వారా బౌల్ట్ ముంబైకి వెళ్లకపోతే అతడి కోసం వేలంలో చాలా ఫ్రాంచైజీలు పోటీ పడేవి.'' అని పేర్కొన్నారు.
![Trent-Boult-1[1]](https://images.news18.com/telugu/uploads/2020/10/Trent-Boult-11.jpg)
ట్రెంట్ బౌల్ట్
ఐపీఎల్ 2020 టోర్నీలో ట్రెంట్ బౌల్ట్ కేక పెట్టిస్తున్నాడు. కుర్రాళ్ల కన్నా మెరుగ్గా రాణిస్తూ.. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ.. బుమ్రాతో పోటీపడి వికెట్లు తీస్తున్నాడు. బ్యాటింగ్‌కు కీలకమైన పవర్ ప్లేలో వికెట్లు పడగొడుతూ.. ప్రత్యర్థి జట్లను దెబ్బ తీస్తున్నాడు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో అద్భుతమైన బంతులు వేసి.. ఆరంభంలోనే రెండు వికెట్లు తీశాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే పృథ్వీషా, అజింక్య రహానేను డకౌట్ చేశాడు.
ORANGE CAP:
PURPLE CAP:
ఈ టోర్నీలో 14 మ్యాచ్‌ల్లో 19.40 సగటుతో 22 వికెట్లు తీశాడు ట్రెంట్ బౌల్ట్. ఒకసారి 4 వికెట్లు తీశాడు. అంతేకాదు ఈసారి పర్పుల్ క్యాప్ రేస్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రా 27 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. 25 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కాగిసో రబడ రెండో స్థానంలో ఉన్నాడు.
Published by:Shiva Kumar Addula
First published:November 08, 2020, 17:46 IST