IPL 2020 TO BE HELD IN UAE FROM SEPTEMBER 19 TO NOVEMBER 10 SA
IPL 2020: మరో నెల రోజుల్లో ఐపీఎల్ పండుగ .. అప్పుడే మెుదలైన బెట్టింగ్స్
సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ 2020 నిర్వహించనున్నారు.
న్ ధన్ సిక్స్‌లు ఔరా! అనిపించే క్యాచులు, గాల్లో ఎగిరే బెల్స్,టెన్షన్ పెట్టే మ్యాచ్‌లు.. ఓ సగటు క్రికెట్ అభిమాని ఆటలో ఎలాంటి మజాను అయితే కొరుకుంటాడో అలాంటి అన్నింటికి ఐపీఎల్ వేదికగా కానున్నది.
మరో నెల రోజుల్లో ఐపీఎల్ పండుగ షూరు కాబోతుంది. అభిమానుల్లో అప్పుడే హుషారు పెరిగింది. మా టీమ్ అంటే మా టీమే ఐపీఎల్ విన్నర్ అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ధన్ ధన్ సిక్స్‌లు ఔరా! అనిపించే క్యాచులు, గాల్లో ఎగిరే బెల్స్,టెన్షన్ పెట్టే మ్యాచ్‌లు.. ఓ సగటు క్రికెట్ అభిమాని ఆటలో ఎలాంటి మజాను అయితే కొరుకుంటాడో అలాంటి అన్నింటికి ఐపీఎల్ వేదికగా కానున్నది. ఆ మాజాను ఆస్వాదించేందుకు వేచి చూడాల్సిన సమయం మరో నెల రోజులే!!
కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమై టెన్షన్‌తో గడుపుతున్న జనాలకు ఈ పొట్టి క్రికెట్ వేడుక కాస్త ఉపశమనం ఇవ్వనుంది. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ సారి అత్యధికమంది వీక్షించే అవకాశం ఉంటుంది. మనసు కాస్త ఉపశమనం కరువైన ఈ రోజుల్లో ఐపీఎల్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కాస్త ఊరటనివ్వనుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తీరక లేకుండా గడిపే ఉద్యోగులకు ఇప్పుడిదే ప్రధాన వినోదంగా మారనుంది.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరుగుతుంది. మొత్తం 53 రోజుల పాటు అబుదాబి, షార్జా, దుబాయ్ మైదనాలలో టోర్నీ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఎంత పటిష్ఠంగా ఉండే బయో బుడగ మధ్యలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మెుదటి మ్యాచ్ సాయంత్రం మ్యాచ్ 3:30 గంటలకు అరంభం కానుండగా, రెండో మ్యాచ్ రాత్రివేళ మ్యాచ్ 7:30 గంటలకు మెుదలవుతుంది. ముఖ్యంగా పండుగ దినాలైన దసరా, దీపవాళీ రోజున మ్యాచ్‌లు ఉండడంతో ప్రకటనలు ఇచ్చే కంపెనీలకు పెద్ద మెుత్తంలో లాభం చేకూరే అవకాశం ఉంది.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.