IPL 2020: ఐపీఎల్ నుంచి వివో ఔట్?

అనుకున్నదే జరిగింది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. తాజాగా చైనా యాప్స్‌ను సమాచార గోప్యత సవాళ్ల నేపథ్యంలో పలు యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.


Updated: August 4, 2020, 8:07 PM IST
IPL 2020: ఐపీఎల్ నుంచి  వివో ఔట్?
ఐపీఎల్ ట్రోఫీ ( Indian Premier League / twitter )
  • Share this:
అనుకున్నదే జరిగింది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
తాజాగా చైనా యాప్స్‌ను సమాచార గోప్యత సవాళ్ల నేపథ్యంలో పలు యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చైనాపై ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలుస్తోంది.

అప్పటి నుంచి చైనా వస్తువుల నిషేధ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా చైనా బ్యాన్ పేరుతో ఉద్యమం కొనసాగుతుంది. #BoycottIPL #ChinesePremierLeague యాష్ ట్యాగ్స్‌‌తో నెటిజన్స్ పోరాటాన్ని తీవ్రతరం చేశారు.

దీంతో టైటిల్ స్పానర్‌షిప్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని వివో భావిస్తున్నట్లు ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని బీసీసీఐకి ముందుగానే వివో ఇండియా తెలియజేసినట్లు సమాచారం. ఈ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గట్టి షాక్ అనే చేప్పాలి. ఒక్కవేళ వివో కనుక తప్పుకుంటే ఇప్పటికిప్పుడు టైటిల్ స్పాన్సర్ దొరకడం కష్టమే. వివో బీసీసీఐకి ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది.

అసలే కరోనా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి వివో విషయం మరింత తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వివోనే టైటిల్ స్పాన్సర్‌షిప్ కొనసాగించాలని సభ్యులు నిర్ణయించారు. కానీ సోమవారం వివో నుంచి సమాచారంతో బీసీసీఐ షాక్‌కు గురైంది.
Published by: Rekulapally Saichand
First published: August 4, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading