IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) ప్రస్థానం ముగిసింది. ఎలాగైనా కప్పు గెలవాలన్న ఆర్సీబీ కల.. మరోసారి కలగానే మిగిలిపోయింది. లీగ్ దశలో మొదట అద్భుతంగా రాణించినప్పటికీ ఆఖరులో తడబడింది. ఐనా నెట్రన్ రేట్‌తో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఐతే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి.. ఇంటి బాటపట్టింది కొహ్లీ సేన. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం.. విరాట్ కొహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ESPN Cric Infoతో మాట్లాడిన గంభీర్.. ''ఒక్కసారి కూడా టైటిల్ గెలవకుండా 8 ఏళ్లు కెప్టెన్‌గా కొనసాగడం చాలా ఎక్కువ. రవిచంద్రన్ అశ్విన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పించారు. రోహిత్ శర్మ, ధోనీ గురించి ఎలా మాట్లాడతామో కొహ్లీ కూడా అంతే. కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించే సమయం వచ్చింది. ముంబై టీమ్‌కు రోహిత్ నాలుగు సార్లు టైటిల్ అందించాడు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ గెలిచింది. అందుకే ఇన్నేళ్లుగా వారు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ ఒక్క కప్పు కూడా గెలవకపోయి ఉంటే అతడిని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించే వారు. జట్టులో ఏ సమస్య ఉన్నా.. బాధ్యతైనా కెప్టెన్ నుంచే ప్రారంభమవ్వాలి. యాజమాన్యం, ఇతర సిబ్బంది నుంచి కాదు. గెలిచినప్పుడు కెప్టెన్‌కు ఎలాగైతే క్రెడిట్ వస్తుందో... ఓడిపోయినప్పుడు కూడా విమర్శలు ఎదుర్కోవాలని.'' అని వ్యాఖ్యానించారు.
గౌతమ్ గంభీర్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా నిర్వహించాడు. అతడి సారథ్యంలో రెండు సార్లు (2012, 2014)లో కేకేఆర్ టైటిల్ గెలిచింది. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయనకు అదే చివరి ఐపీఎల్ సీజన్ కావడం గమనార్హం.
కాగా, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా కప్పు గెలవాలని.. ప్రతిసారి అనుకుంటుంది. కానీ చివరికి వచ్చే సరికి అంతా తలకిందులవుతుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమై 13 ఏళ్లవుతున్నా.. బెంగళూరు ఇప్పటికీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. టీమిండియా కెప్టెన్ కొహ్లీ ఎనిమిదేళ్లుగా సారధ్యం వహిస్తున్నా.. ఆర్సీబీ రాత మారలేదు. ఈసారి లీగ్ ప్రారంభంలో బాగా రాణించినప్పటికీ.. చివర్లో మాత్రం గాడి తప్పింది. చివరి నాలుగు మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్లోనూ ఓటమి పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే కొహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.