HOME »NEWS » »ipl 2020 this bowler delivers the fastest ball in ipl history at 156 kmph breaks dale stayns record details here ms

IPL 2020: ఇది మామూలు వేగం కాదు.. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కొత్త రికార్డు

IPL 2020: ఇది మామూలు వేగం కాదు.. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కొత్త రికార్డు
Image (@IPL twitter)

ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతున్నది. ఆ జట్టు విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆ జట్టు బౌలర్ ఆన్రిచ్ నార్జ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

  • News18
  • Last Updated: October 15, 2020, 09:20 IST
  • Share this:
    ఐపీఎల్ 2020 సీజన్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో పాయింట్ల పట్టికలో ఆ జట్టే మొదటిస్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో ఆ జట్టు సమతూకంగా ఉంది. ఇక బౌలింగ్ లో ఆ జట్టు తరఫున ఆడుతున్న బౌలర్ ఆన్రిచ్ నార్జ్ అయితే రాకెట్ స్పీడ్ తో బంతులేస్తూ నిప్పులు చెరుగుతున్నాడు. తాజాగా ఈ కుడిచేతి వాటం బౌలర్.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్ గా తన పేరిట రికార్డు నమోదుచేసుకున్నాడు.

    బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బంతి అందుకున్న ఈ సౌతాఫ్రికన్ స్టార్ బౌలర్.. 156.22 kmph వేగంతో బంతిని విసిరాడు. అదే ఓవర్లో తర్వాతి బంతికే ఆర్ఆర్ ఓపెనర్ బట్లర్ ను ఔట్ చేశాడు. అయితే ఇప్పటివరకూ ఐపీఎల్ లో అత్యంత వేగంగా బంతి విసిరిన వారిలో మొదటి మూడు స్థానాల్లో నార్జ్ ఉండటం విశేషం. అంతకుముందు కూడా ఈ రికార్డు దక్షిణాఫ్రికా బౌలర్ల పేరుమీదే ఉంది. డేల్ స్టెయిన్ ఫాస్ట్ గా విసిరిన బంతి వేగం 154.40 kmph.



    ఇప్పటిదాకా నమోదైన టాప్-5 రికార్డులు..
    ఆన్రిచ్ నార్జ్ - 156.2
    ఆన్రిచ్ నార్జ్ - 155.2
    ఆన్రిచ్ నార్జ్ - 154.7
    డేల్ స్టెయిన్ - 154.4

    కగిసొ రబడ - 154.2





    వీరందరూ దక్షిణాఫ్రికా బౌలర్లే కావడం గమనార్హం. కాగా ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్లలో రబడా (పర్పుల్ క్యాప్ హోల్డర్) ఉండగా.. నార్జ్ పదో స్థానంలో ఉన్నాడు. రబాడా 18 వికెట్లు తీయగా.. నార్జ్ పది వికెట్లు తీశాడు.   ఢిల్లీ విజయాల్లో నార్జ్, రబడా లది కీలకపాత్ర.
    Published by:Srinivas Munigala
    First published:October 15, 2020, 09:19 IST

    टॉप स्टोरीज