సన్‌రైజర్స్ టాప్ ఆటగాళ్ళు.. ఆ ఒక్కడు రాణిస్తే చాలు.. టైటిల్ ఆ జట్టుదే!

డెక్కన్ ఛార్జర్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్గా మారి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా రాణిస్తుంది. ఈ టీం ఐపీఎల్ సీజన్లో ఒకసారి టైటిల్ గెలుచుకోవడమే కాకుండా ప్రత్యర్థి జట్టులకు ధీటుగా నిలుస్తుంది.


Updated: September 14, 2020, 11:26 AM IST
సన్‌రైజర్స్ టాప్ ఆటగాళ్ళు.. ఆ ఒక్కడు రాణిస్తే చాలు.. టైటిల్ ఆ జట్టుదే!
డెక్కన్ ఛార్జర్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్గా మారి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా రాణిస్తుంది. ఈ టీం ఐపీఎల్ సీజన్లో ఒకసారి టైటిల్ గెలుచుకోవడమే కాకుండా ప్రత్యర్థి జట్టులకు ధీటుగా నిలుస్తుంది.
  • Share this:
డెక్కన్ ఛార్జర్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్గా మారి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా రాణిస్తుంది. ఈ టీం ఐపీఎల్ సీజన్లో ఒకసారి టైటిల్ గెలుచుకోవడమే కాకుండా ప్రత్యర్థి జట్టులకు ధీటుగా నిలుస్తుంది. కాగా ఈనెల 19న ప్రారంభంకానున్న ఐపిఎల్–13 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో మంచి రన్ సాధించే ప్లేయర్స్ గురించి పరిశీలిద్దాం

1. డేవిడ్ వార్నర్

ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ సన్రైజర్స్ హైదరాబాద్కు బలమైన ఆటగాడిగా రాణిస్తున్నాడు. వార్నర్ ఆడిన మొత్తం 71 మ్యాచ్ల్లో మంచి యావరేజ్ స్కోర్ 55.44 సాధించాడు. వార్నర్ 146.87 స్ట్రైక్ రేట్తో ఐపీఎల్లో ఇప్పటివరకు 3271 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020లో కూడా రాణిస్తే టైటిల్
సన్‌రైజర్స్ సొంతమవుతోంది.

2. శిఖర్ ధావన్

ఇండియన్ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఐపీఎల్లో మంచి రికార్డునే నమోదుచేశాడు. తను ఆడిన 85 మ్యాచ్ల్లో 34.49 సగటుతో 2518 పరుగులు చేశాడు.

3 కేన్ విలియమ్సన్

ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ ప్రపంచ క్రికెట్లో అత్యంత సమతుల్య బ్యాట్స్మెన్లలో ఒకడు అయిన విలియమ్సన్ ఐపిఎల్లో మంచి ఆట తీరుతో రాణిస్తున్నాడు. విలియమ్సన్ ఇప్పటివరకు 41 మ్యాచ్ల్లో 38.29 సగటుతో 1302 పరుగులు చేశాడు.

4 మొయిసెస్ హెన్రిక్స్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మొయిసెస్ హెన్రిక్స్ కిందటి సీజన్లలో సన్రైజర్స్ జట్టుకు మంచి రన్స్ అందించాడు. ఆయన ఇప్పటివరకు 42 మ్యాచ్ల్లో యావరేజ్ స్కోర్ 27.96 సాధించాడు. మొయిసెన్ 128.83 స్ట్రైక్ రేట్తో 755 పరుగులు చేశాడు.

5 మనీష్ పాండే

సన్ రైజర్స్ టీం కోసం అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడు. తన కుడిచేతి ఆటతో గత రెండు సీజన్లలో మంచి ఫామ్ను కనుగొన్నాడు. పాండే 27 మ్యాచ్ల్లో 33.05 సగటుతో 628 పరుగులు చేశాడు.

6 నమన్ ఓజా

సన్రైజర్స్ టీంలో మంచి వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ గా రాణిస్తున్న నమన్ ఓజా 56 మ్యాచ్ల్లో 19.46 సగటుతో 584 పరుగులు చేశాడు.

7 యువరాజ్ సింగ్

2007, 2011 ప్రపంచ కప్ విజేతల్లో యువరాజ్ మంచి ఆటతీరుతో సన్రైజర్స్ జట్టులో రాణిస్తున్నాడు. యువరాజ్ ఇప్పటివరకు 27.11 యావరేజ్ స్కోర్ తో 22 మ్యాచ్ల్లో 488 పరుగులు చేశాడు.

8 జానీ బెయిర్స్టో

ఇంగ్లాండ్కు చెందిన జానీ బెయిర్స్టో లిమిటెడ్ ఓవర్ల సీజన్లలో మంచి ఆటతీరు కనబరుస్తాడు. బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ కలయిక ఓపెనర్గా దిగి మంచి రన్స్ సాధించి రికార్డు నెలకొల్పారు. బెయిర్స్టో 10 మ్యాచ్ల్లో 55.62 సగటుతో 445 పరుగులు చేశాడు.

9 దీపక్ హుడా

హార్డ్-హిట్టింగ్ ఆల్ రౌండర్గా నిలిచిన దీపక్ హుడా సన్రైజర్స్ జట్టులోని యంగ్ ప్లేయర్గా ఉత్తమ బ్యాటింగ్తో రాణిస్తున్నాడు. అతను 47 మ్యాచ్లలో 13.81 యావరేజ్ స్కోర్ సాధించాడు. 117.66 స్ట్రైక్ రేట్తో 373 పరుగులు చేశాడు.

10 విజయ్ శంకర్

తమిళనాడుకు చెందిన ఈ యంగ్ ఆల్ రౌండర్ ఐపిఎల్లో నెమ్మదిగా తన ఆటతీరును మెరుగుపర్చుకొని మంచి ఆటతీరుతో రాణిస్తున్నాడు. 19 మ్యాచ్ల్లో 24.64 యావరేజ్ స్కోర్ సాధించాడు. 128.73 స్ట్రైక్ రేట్తో 345 పరుగులు తీశాడు.
Published by: Rekulapally Saichand
First published: September 14, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading