IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రయ్ రయ్ మంటూ దూసుకెళ్తోంది. ప్రారంభంలో కాస్త ఇబ్బందులు పడినా ఆఖరులో అదరగొట్టి.. టాప్ టీమ్‌లను ఓడించింది. నెట్రన్ రేట్‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అంతేకాదు ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి క్వాలిఫైయర్-2కు చేరింది. ఇవాళ రాత్రి 07.30కి అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. ఇవాళ గెలిచిన జట్టు ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టును ఢీకొడుతుంది.
హైదరాబాద్ టీమ్ టైటిల్ విజయానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో SRH టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఇటీవల ప్రారంభమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆరెంజ్ కలర్లో లైటింగ్ ఏర్పాటు చేసింది. సన్‌రైజర్స్ డిజిటల్ లోగో ఏర్పాటు చేసి... We are proud of you అని పేర్కొంది. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు తెలంగాణ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
ఎలిమినేటర్‌లో బెంగళూరుపై సన్‌రైజర్స్ విజయం సాధించగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. SRH టీమ్‌ను అభినందించిన ఆయన.. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్ తీసుకురావాలని ఆకాంక్షించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.