Home /News /ipl /

IPL 2020 TAMIL HERO VIJAY TATTOO ON KKR CRICKETER VARUN CHAKRAVARTHY PHOTO GOES VIRAL SK

IPL 2020: ఈ క్రికెటర్ భుజంపై హీరో విజయ్ టాటూ.. తలైవా ఫ్యాన్స్‌కు పండగే

వరుణ్ చక్రవర్తి, హీరో విజయ్

వరుణ్ చక్రవర్తి, హీరో విజయ్

వరుణ్ చక్రవర్తి భుజంపై తలైవా విజయ్ టాటూ కనిపించింది. ఇంకేం.. తలైవా అభిమానులకు నిజంగా ఇది పండగే. అందుకే వరుణ్ చక్రవర్తి పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

    విజయ్.. ఈ పేరు వింటే తమిళ యువత పూనకాలతో ఊగిపోతారు. థియేటర్లలో ఈలలు, గోలలు, చప్పట్ల మోత మోగిస్తారు. తలైవా.. తలైవా.. అంటూ రచ్చ రచ్చ చేస్తారు. తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలో కోట్లాది మంది అభిమానులు విజయ్‌కి ఉన్నారు. వీరిలో చాలా మందికి విజయ్ అంటే పిచ్చి. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. విజయ్ పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరు ఆయన ఫొటోను టాటూ వేయించుకొని గుండెల్లో గూడు కట్టుకున్నారు. అలాంటి అభిమానుల్లో ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతడే వరుణ్ చక్రవర్తి.

    ఈ ఐపీఎల్‌ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్న వరుణ్.. తమిళ తలైవా విజయ్‌కు వీరాభిమాని. క్రికెటర్లకు హీరోలు, హీరోలకు క్రికెటర్లకు అభిమానులు ఉండడం కామన్. కానీ వరుణ్ చక్రవర్తి.. విజయ్‌కు అభిమాని కాదు. భక్తుడు. ఈ విషయం ఓ ఫొటో ద్వారా బయటపడింది. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్‌కమ ఆన్‌బోర్డ్ కోల్‌గేట్ అంటూ ఓ ట్వీట్ చేసింది. అందులో బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. ఐతే అతడి భుజంపై తలైవా విజయ్ టాటూ కనిపించింది. ఇంకేం.. తలైవా అభిమానులకు నిజంగా ఇది పండగే. అందుకే వరుణ్ చక్రవర్తి పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

    వరుణ్ చక్రవర్తి.. హీరో విజయ్‌కు డై హార్డ్ ఫ్యాన్‌లా ఉన్నాడని అతడి అభిమానులు ట్వీట్ల మోత మోగిస్తున్నారు.




    29 ఏళ్ల వరుణ్ చక్రవర్తి స్వస్థలం బీదర్ (కర్నాటక). గత ఐపీఎల్ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన వరుణ్ చక్రవర్తి.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 5 వికెట్లు పడగొట్టాడు. 2/25 ఈ సీజన్‌లో అతడి ఉత్తమ్ బౌలింగ్ ప్రదర్శన. అద్భుతమైన మంచి బౌలింగ్ యాక్షన్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. వరుణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Kolkata Knight Riders, Vijay

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు