Home /News /ipl /

IPL 2020 SURPRISING THAT NO ONE PICKED HIM IN THE AUCTION GAUTAM GAMBHIR RECKONS STAR INTERNATIONAL ALL ROUNDER HAS PROVEN HIS WORTH SK

IPL 2020: వేలంలో ఎవరూ తీసుకోలేదు.. కానీ ఇప్పుడు అతడే సూపర్ స్టార్

జేషన్ హోల్డర్ (Image:IPL)

జేషన్ హోల్డర్ (Image:IPL)

వాస్తవానికి 2019 డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో హోల్డర్‌ను ఎవరూ తీసుకోలేదు. కానీ మిచెల్ మార్ష్ గాయపడడంతో అతడి స్థానంలో అనుకోకుండా జట్టులోకి వచ్చి.. సూపర్ స్టార్‌గా మారిపోయాడు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీ మధ్యలో కాస్త తడబడింది. కానీ లీగ్ దశ ఆఖరులో మాత్రం అద్భుతంగా రాణించింది. తన చివరి మూడు మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లను ఓడించి.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. క్వాలిఫైయర్-1లోనూ అదరగొట్టి.. బెంగళూరును ఓడించింది. జట్టు ఇంత వరకు చేరుకుందంటే.. అందులో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఇటు బాల్‌తో.. అటు బ్యాట్‌తో రాణిస్తూ.. ఇప్పుడు టీమ్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడు హోల్డర్. వాస్తవానికి 2019 డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో హోల్డర్‌ను ఎవరూ తీసుకోలేదు. కానీ మిచెల్ మార్ష్ గాయపడడంతో అతడి స్థానంలో అనుకోకుండా జట్టులోకి వచ్చి.. సూపర్ స్టార్‌గా మారిపోయాడు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ హోల్డర్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాట్లాడారు. గత ఏడాది జరిగిన వేలంలో హోల్డర్‌ని ఎవరూ తీసుకోకపోవడంతో తాను ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపారు. ESPNCricinfoతో గంభీర్ మాట్లాడుతూ.. ''హోల్డర్ లాంటి ఆల్‌రౌండర్‌ని వేలంలో ఎవరూ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జిమ్మీ నీషమ్‌ను తీసుకున్నారు. క్రిస్ మోరిస్‌ను తీసుకున్నారు. ఇతర ఆల్‌రౌండర్స్‌నీ తీసుకున్నారు. కానీ రెండు ఫార్మట్లు ఆడే హోల్డర్‌పై ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒత్తిడిలో రాణించగల సత్తా ఉంది. అందుకే సన్‌రైజర్స్ జట్టుకు మంచి మ్యాచ్ ఫినిషింగ్ అందిస్తున్నాడు.'' అని పేర్కొన్నారు.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన జేసన్ హోల్డర్.. 16.35 సగటుతో 14 వికెట్లు తీసుకున్నాడు. 3/25 అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు హోల్డర్. కీలక సమయంలో విలువైన పరుగులు అందించి.. జట్టుకు పలు విజయలను అందించాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Sun risers hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు