ఐపీఎల్ 2020

  • associate partner

Suresh Raina: IPL 2020 నుంచి సురేష్ రైనా ఔట్...నిరాశలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్

సురేష్ రైనా IPL నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది.

news18-telugu
Updated: August 29, 2020, 12:47 PM IST
Suresh Raina: IPL 2020 నుంచి సురేష్ రైనా ఔట్...నిరాశలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్
సురేష్ రైనా
  • Share this:
ఐపీఎల్‌2020 చెన్నై సూపర్ కింగ్స్ కు మ‌రో షాక్ త‌గిలింది. జట్టులో కీలక ఆటగాడు సురేష్ రైనా IPL నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కెఎస్ విశ్వ నాథన్ తెలిపారు. ఇక ఈ ఐపిఎల్ సీజన్ లో రైనా అందుబాటులో ఉండడని పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ రైనాకు అతడి కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. IPLసెప్టెంబర్ 17 నుంచి జరుగుతుంది. ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. రైనా నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ కు, క్రికెట్ ప్రేమికులకు ఇది నిరాశ క‌లిగిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 11 మంది స్టాఫ్ తో పాటు ఒక ఫాస్ట్ బౌలర్ కు కరోనా సోకడంతో ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
Published by: Krishna Adithya
First published: August 29, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading