హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

హోటల్ రూంలో చెన్నై ఆటగాళ్ళు.. వీడియో షేర్ చేసిన రైనా

హోటల్ రూంలో చెన్నై ఆటగాళ్ళు.. వీడియో షేర్ చేసిన రైనా

సురేష్ రైనా

సురేష్ రైనా

చెన్నై టీం ఆటగాళ్లు దుబాయ్‌లో బాగా ఎంజాయి చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు ఆటగాడు సురేష్ రైనా ఇన్‌స్ట్రాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో అక్కడి ఓ భవన నమూనాను చూపిస్తూ ఆ పోస్ట్ పెట్టాడు.

  చెన్నై టీం ఆటగాళ్లు దుబాయ్‌లో బాగా ఎంజాయి చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు ఆటగాడు సురేష్ రైనా  ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో అక్కడి ఓ భవన నమూనాను చూపిస్తూ ఆ పోస్ట్ పెట్టాడు. అలాగే "దుబాయ్ లైఫ్, అబ్బురపరిచే ఆకాశ విహంగం దృశ్యం దుబాయ్" అనే క్యాప్షన్‌‌ను కూడా జోడించాడు. ఐపీఎల్‌-2020లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు దుబాయ్ చేరుకున్న విషయం తెలిసిందే.


  ఆటగాళ్ళ అందరికి ఓ లగ్జరీ హోటళ్ళో బస ఏర్పాటు చేసింది జట్టు యాజమాన్యం. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ క్వారంటైన్‌‌లో ఉన్నారు. కొద్ది రోజులు క్వారంటైన్‌‌లో ఉన్న తర్వాత కరోనా వైరస్‌ టెస్టులు చేసి ఆటగాళ్లను వారి జట్లతో కలిసే అవకాశం ఉంది. ఐపీఎల్‌ నిబంధనల్లో భాగంగా ప్రోటాకాల్‌ను పాటిస్తూ టీం మెంబర్స్ అందరూ స్వీయ నిర్భందంలో ఉన్నారు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Bcci, Dubai, IPL 2020, Suresh raina

  ఉత్తమ కథలు