ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఈ మార్పులు అవసరం

ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడు విజయాలనే సాధించింది.


Updated: October 21, 2020, 1:29 PM IST
IPL 2020: సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఈ మార్పులు అవసరం
ఇక బౌలింగ్ విభాగానికి వస్తే భువనేశ్వర్‌‌ లేకపోవడంతో పెద్ద లోటుగానే కనిపిస్తోంది. రషీద్‌‌ ఖాన్‌‌ రాణిస్తున్న.మిగితా బౌలర్లు విఫలమవుతున్నారు. ముందు బాగానే వేస్తున్న డెత్‌‌ ఓవర్లలో రన్స్‌‌ కట్టడి చేయలేకపోతున్నారు. జట్టులో మార్పులో జరిగే అవకాశం కనిపిస్తోంది. విజయ్ శంకర్‌, ఖలీల్‌ స్థానంలో అబ్దుల్ సమద్, బాసిల్ థంపిలను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
  • Share this:


ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడు విజయాలనే సాధించింది.బఆరు మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలేంజర్స్ బెంగళూర్ మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. అనవసరంగా ఓటమిని కొనితెచ్చుకుంది. అనవసరంగా వికెట్లు పారేసుకుని ఓటమిపాలైంది.

కోల్‌కతాతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమిని చవిచూసింది. గెలుపు అంచుల వరకు వెళ్ళీ టై మ్యాచ్ ముగించింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లలో 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే మ్యాచ్‌లో కనుక సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఉంటే 8 పాయింట్లతో.. మెరుగైన రన్ రేటు కారణంగా పాయింట్ల పట్టికలో
టాప్-4లో నిలిచేది. దీంతో ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగయ్యేవి. ఆ తర్వాత జరిగే మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచినా రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ రేసులో నిలిచేది.
కానీ ఆ మ్యాచ్‌లో ఓడి అటా..ఇటా అనే పరిస్థితికి చేరింది.

అయినప్పటికి సన్‌ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రైజర్స్ ఆడబోయే 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో కచ్చితంగా గెలవాలి. ఇతర జట్ల గెలుపోటములు కూడా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చేస్తాయి. కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్ జట్లు ముందు జరబోయే మ్యాచ్‌ల్లో ఓటమి చెందితే ఆరెంజ్ ఆర్మీకి మెరుగైనా అవకాశాలు ఉంటాయి. రాజస్థాన్ , పంజాబ్ , ఢిల్లీ , బెంగళూరు, ముంబై జట్లతో సన్‌రైజర్స్ తలపడనుంది. పదునైనా వ్యూహాలతో బరిలోకి దిగి ఆ జట్లను ఓడిస్తేన్ సన్‌రైజర్స్‌కు ఫ్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.

జట్టులో మార్పులు సన్‌రైజర్స్ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలి. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న ప్రియమ్ గార్గ్,మనీష్ పాండే స్ధానంలో విరాట్ సింగ్, అభిషేక్ శర్మలను ఆడించాలి. గాయపడిన విలియమ్సన్ స్థానంలో ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి తుది జట్టులో చోటు కల్పించాలి. అలాగే బెసిల్ థంపీ స్థానంలో ఆంధ్రా బౌలర్ పృథ్వీ రాజ్ యర్రాకు అవకాశం ఇవ్వాలి.
Published by: Rekulapally Saichand
First published: October 21, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading