ఐపీఎల్ 2020

  • associate partner

SRH vs RCB: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన కొహ్లీ.. కష్టాల్లో ఆర్సీబీ

SRH vs RCB: ఎలిమినేటర్ మ్యాచ్లో కొహ్లీ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కీలకమైన మ్యాచ్‌ల్లో కొహ్లీ ఎప్పుడూ విఫలమవుతుంటాడని..కెప్టెన్సీ నుంచి తొలగించాలని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

news18-telugu
Updated: November 6, 2020, 7:55 PM IST
SRH vs RCB: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన కొహ్లీ.. కష్టాల్లో ఆర్సీబీ
విరాట్ కొహ్లీ
  • Share this:
IPL 2020 Eliminator, SRH vs RCB: టైటిల్ సాధించాలంటే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు చాలా కీలకం. ముఖ్యంగా ఎలిమినేటర్‌లో గెలిస్తేనే తదుపరి ముందుకు వెళ్లవచ్చు. అలాంటి కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ చెతులెత్తేశాడు. సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని.. రెండో స్థానం నుంచి ఓపెనర్‌గా వచ్చిన కొహ్లీ.. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండో ఓవర్లలో ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హైదరాబాద్ బౌలర్ హోల్డర్ అతడిని బోల్తా కొట్టించాడు. కొత్త కీపర్ గోస్వామి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కొహ్లీ దొరికిపోయాడు. ఐతే కీలకమైన మ్యాచ్‌లో కొహ్లీ ఔట్ కావడంతో రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు.

ఎలిమినేటర్ మ్యాచ్లో కొహ్లీ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కీలకమైన మ్యాచ్‌ల్లో కొహ్లీ ఎప్పుడూ విఫలమవుతుంటాడని..కెప్టెన్సీ నుంచి తొలగించాలని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.








ఈ పోరులో గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాటపడతారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో గెలివాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సెప్టెంబరు 21న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. అక్టోబరు 31న షార్జా వేదికగా మ్యాచ్‌లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది ఎస్‌ఆర్‌హెచ్.

కాగా, లీగ్ దశలో విడివిడిగా 14 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు.. చోరో ఏడింట గెలిచాయి. మరో ఏడింట ఓడిపోయాయి. 14 పాయింట్లు సాధించాయి. ఐతే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా పాయింట్లో పట్టికలో మూడో స్థానాన్ని సాధించింది హైదరాబాద్. కొహ్లీ సేన నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్‌-కు వెళ్తుంది. నవంబరు 8న జరిగే ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 6, 2020, 7:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading