Home /News /ipl /

IPL 2020 SRH BOWLER NATARAJAN IS THE PACER WHO DELIVERS MOST YORKERS IN IPL 2020 SK

Natarajan: సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్ రికార్డు.. బుమ్రా కన్నా తోపు

నటరాజన్ (Image:IPL)

నటరాజన్ (Image:IPL)

IPL 2020: ఇవాళ్టి మ్యాచ్‌తో కలిసి ఐపీఎల్ 2020 టోర్నీలో 16 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 8.02 సగటుతో 16 వికెట్లు తీశాడు.

    సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గాయం కారణంగా భువనేశ్వర్ తప్పుకోవడంతో జట్టులో అతడికి చోటు దక్కింది. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తక్కువ పరుగులు ఇవ్వడం మనోడి స్పెషాలిటీ. పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. అవసరమైన సమయంలో వికెట్లు పడగొడుతూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు ఎన్.నటరాజన్. ఐపీఎల్ 2020 టోర్నీలో అత్యధిక యార్కర్లు వేసిన పేసర్‌‌గా ఘనత సాధించాడు.

    ఐపీఎల్ 2020 టోర్నీలో నటరాజన్ ఇప్పటి వరకు 54 యార్కర్లు వేశాడు. అతడి తర్వాతి స్థానాల్లో హోల్డర్, బౌల్ట్, త్యాగి, బ్రావో ఉన్నారు. హోల్డర్ 25, బౌల్ట్ 22, త్యాగి 22, బ్రావో 21 యార్కర్లు వేశారు. నటరాజన్ ఈ రికార్డు సాధించడంతో.. అతడిపై సన్‌రైజర్స్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మా నట్టు తోపు అంటూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు. టీమిండియాలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తాడని అభిప్రాయపడుతున్నారు. బుమ్రాతో కలిసి డెత్ ఓవర్లలో నటరాజన్ బౌలింగ్ వేస్తే.. అద్భుతంగా ఉంటుందని ట్వీట్స్ పెడుతున్నారు.






    ఇర్ఫాన్ పఠాన్ కూడా నటరాజన్ యార్కర్స్‌ని మెచ్చుకున్నాడు. అన్‌క్యాప్డ్ (టీమిండియాకు ఆడని ఆటగాడు) బౌలర్ ఇంత పర్‌ఫెక్ట్‌గా యార్కర్లు వేయడం ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశాడు.

    ఇవాళ్టి మ్యాచ్‌తో కలిసి ఐపీఎల్ 2020 టోర్నీలో 16 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 8.02 సగటుతో 16 వికెట్లు తీశాడు. 2/24 అతడి ఉత్తమ ప్రదర్శన. నటరాజన్‌కు ఇది రెండో ఐపీఎల్ సీజన్. 2017లో కేవలం 6 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీశాడు. అప్పుడు విఫలమైనా.. ఇప్పుడు మాత్రం అదరగొడుతున్నాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Sun risers hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు