ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఆ లోటును పూడ్చుకునేందుకు బీసీసీఐ మాస్లర్ ప్లాన్

ఐపీఎల్‌‌కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాంఛైజీలు ఆటగాళ్ళను దుబాయ్ తరిలించేందుకు సిద్దమవుతున్నాయి. ఐపీఎల్‌కు సంబంధించి అన్ని ఓకే అయినప్పటికి ఇప్పుడు బీసీసీఐని ఓ సమస్య వెంటాడుతోంది.

Rekulapally Saichand
Updated: August 13, 2020, 6:48 PM IST
IPL 2020: ఆ లోటును పూడ్చుకునేందుకు బీసీసీఐ  మాస్లర్  ప్లాన్
bcci vs star sports
  • Share this:
ఐపీఎల్‌‌కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాంఛైజీలు ఆటగాళ్ళను దుబాయ్ తరిలించేందుకు సిద్దమవుతున్నాయి. ఐపీఎల్‌కు సంబంధించి అన్ని ఓకే అయినప్పటికి ఇప్పుడు బీసీసీఐని ఓ సమస్య వెంటాడుతోంది. టైటిల్ స్సాన్సర్ నుంచి వివో తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. వివో ఏడాదికి 440 కోట్లు చెల్లించే విధంగా బిసీపీఐతో ఓస్సందం కుదుర్చుకుంది. కానీ టోర్నీ ప్రారంభానికి ముందు స్పాన్సర్ నుంచి తప్పుకోవడంతో బోర్డుకు కొత్త తలనొప్పి మెుదలైంది.

కరోనా కష్టకాలంలో ఎవరు అంత మొత్తానికి టైటిల్‌ హక్కులు సొంతం చేసుకొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కొత్తగా వచ్చే ఒక్కో ఇతర స్పాన్సర్ నుంచి దాదాపు రూ.40 కోట్లు చొప్పున రాబట్టాలని చూస్తోంది. ఈ మెుత్తంతో టైటిల్ స్పానర్ లోటును పూడ్చాలనేది బీసీసీఐ ప్లాన్‌లా కనిపిస్తోంది.

తాజాగా అన్‌ అకాడమీ,క్రెడ్‌ ఐపీఎల్‌కు స్పాన్సర్‌‌షిప్ ఇచ్చేందుకు రెండు కొత్త సంప్థలు ముందుకు వచ్చాయని తెలుస్తోంది. కొత్తగా మరీన్ని  సంస్థలు కూడా స్పాన్పర్ అందించేందుకు ముందుకు రానున్నట్లు సమాచారం. మెుత్తంగా ఈ సంస్థల ద్వారా కొత్త టైటిల్ స్పాన్సర్ ఇచ్చే తక్కువ మెుత్తం లోటు పూడ్చాలన్నది బోర్డు ఆలోచన. ఇక అమెజాన్‌, బైజూస్‌, డ్రీమ్‌ లెవెన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులో ఉన్న విషయం తెలిసిందే.
Published by: Rekulapally Saichand
First published: August 13, 2020, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading