హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020: టీవీ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన ఈ ఐపీఎల్ సీజన్.. ఎంతమంది వీక్షించారంటే..

IPL 2020: టీవీ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన ఈ ఐపీఎల్ సీజన్.. ఎంతమంది వీక్షించారంటే..

ఐపీఎల్ 2020

ఐపీఎల్ 2020

ఈ ఏడాది ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఐపీఎల్ 2020ని టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులు సంఖ్య భారీగా పెరిగింది.

కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నిని యూఏఈ‌లో నిర్వహించారు. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి. అయితే మైదానంలో అభిమానులే లేని ఈ టోర్ని క్రీడా అభిమానులను ఆకట్టుకుందా అని చాలా మంది మదిలో అనుమానం ఉంది. అయితే అటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ ఏడాది ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఐపీఎల్ 2020ని టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులు సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది ఐపీఎల్ వ్యూయింగ్‌ మినిట్స్‌‌తో (ఒక ఈవెంట్‌ను  అందరి వ్యక్తులు చూసే నిమిషాల మొత్తం) పోలిస్తే.. ఈ సారి ఆ సంఖ్య 23 శాతం పెరిగింది. బ్రాడ్‌కాస్ట్ అడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణంకాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

గతేడాది ఐపీఎల్‌ను 326 బిలియన్స్ వ్యూయింగ్‌ మినిట్స్‌ సాధిస్తే, ఈ ఏడాది అది 400 బిలియన్స్ వ్యూయింగ్‌ మినిట్స్‌‌కి చేరింది. దీంతో 400 బిలియన్ వ్యూయింగ్‌ మినిట్స్‌ అధిగమించిన తొలి స్పోర్ట్స్ టోర్నమెంట్‌గా ఐపీఎల్ నిలించింది. అంతకుముందు అత్యధిక వ్యూయింగ్‌ మినిట్స్‌ సొంతం చేసుకున్న రికార్డు గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ పేరిట ఉంది. ఆ టోర్ని 344 వ్యూయింగ్ మినిట్స్ సొంతం చేసుకుంది. ఇక, వీక్షకుల సంఖ్య విషయానికి వస్తే ఐపీఎల్-2020ని 405 మిలియన్ల(40.5 కోట్ల) మంది వీక్షించారు.

ఐపీఎల్-2020లో భాగంగా తొలి నాలుగువారాల్లో జరిగిన 32 మ్యాచ్‌లకు 7.3 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ రాగా, గత సీజన్‌లో తొలి నాలుగు వారాలకు 5.6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయి. ఇక, ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ను ప్రేక్షకులు వీక్షించిన సమయం అవరేజ్‌గా 15 శాతం పెరిగింది. గత సీజన్‌లో ప్రేక్షకులు ఐపీఎల్ చూడటానికి 37 నిమిషాల(సగటున) సమయం కేటాయిస్తే.. ఈ సారి 42 నిమిషాలు(సగటున) కేటాయించారు.

ఇక, టీవీలోనే కాకుండా డిస్నీ+హాటస్టార్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా ప్రేక్షకులు ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూశారు. హాటస్టార్‌లో మ్యాచ్‌లో వీక్షించేవారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్టు నివేదికలు వెలువడ్డాయి. అయితే స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో.. టీవీలో ఐపీఎ‌ల్‌ను వీక్షించేవారి సంఖ్య భారీగా పెరిగడానికి ఒక కారణమని కొందరు అంటున్నారు.

First published:

Tags: IPL 2020

ఉత్తమ కథలు