ఐపీఎల్ ఆటగాళ్ళను గాయాల బెడద వీడడం లేదు. ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు గాయాల పాలై టోర్నీ నుంచి దూరమయ్యారు. తాజాగా ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా భుజం నోప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఒక్కవేళ టోర్నీ తప్పుకుంటే ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. కెప్టెన్‌గా,బాట్స్‌మెన్‌గా కీలక పాత్ర పోషిస్తూ జట్టుకు అపూర్వమైన విజయాలను అందిస్తున్నాడు. టీంను ఒకే బాటపై నడిపిస్తూ గెలవలన్నా లక్ష్యంతో ఆడుతున్నాడు. తన వ్యూహ రచనతో దిగ్గజ నాయకత్వం గలిగిన జట్లను కూడా మట్టికరిపిస్తూ అనూహ్య ఫలితాలను రాబట్టుకుంటున్నాడు.
ప్రత్యర్థులను కట్టడి చేస్తూ ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలిపిస్తున్నాడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డారు. దీంతో అర్ధాంతరంగా ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో
బంతి అడ్డుకోబోయి కింద పడిపోయాడు. దీంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. ఫిజియోథెరపిస్ట్ సూచన మేరకు మైదానం వీడి పెవిలియన్‌కు చేరాడు.
అతని గాయంపై క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు.
శ్రేయాస్ అయ్యర్ గాయం సంబంధించిన ఇప్పుడే ఏం చేప్పలేమన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. శ్రేయాస్ మైదానాన్న వీడిన తర్వాత శిఖర్ ధావన్ కేప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఢిల్లీ కేపిటల్స్ దాదాపు ఫ్లే ఆఫ్‌కు చేరినప్పటికి ఫైనల్ వరకు చేరాలంటే నాయకత్వం కీలకం. ఢిల్లీ తదుపరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. శనివారం ఈ మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ ఆడకపోవచ్చు. గాయం కొంత తీవ్రమైనది కాబట్టి... విశ్రాంతి అవసరం. తర్వాతి మ్యాచ్‌లకు అతను కీలకం కాబట్టి ముందుజాగ్రత్తగా శ్రేయాస్‌కు రెస్ట్ కల్పించనున్నారు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 161 పరుగుల స్కోరును రాజస్ధాన్ ఛేధించలేకపోయింది.
Published by:Rekulapally Saichand
First published:October 15, 2020, 13:10 IST