IPL 2020: గబ్బరే నెంబర్ వన్.. ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ కొత్త రికార్డ్

శిఖర్ ధావన్ (Image:IPL)

భారత బ్యాట్స్‌మెన్‌లో మాత్రం శిఖర్ ధావనే టాప్‌లో ఉన్నాడు. గబ్బర్ తర్వాతి స్థానాల్లో విరాట్ కొహ్లీ, సురేష్ రైనా, రోహత్ శర్మ, గౌతం గంభీర్ ఉన్నారు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు 167 మ్యాచ్‌ల్లో 166 ఇనింగ్స్ ఆడిన శిఖర్ ధావన్.. 39 అర్ధ సెంచరీలు చేశాడు. ఐతే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. 134 ఇన్నింగ్స్ ఆడిన వార్నర్.. ఏకంగా 46 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ వార్నరే టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు.

    భారత బ్యాట్స్‌మెన్‌లో మాత్రం శిఖర్ ధావనే టాప్‌లో ఉన్నాడు. గబ్బర్ తర్వాతి స్థానాల్లో విరాట్ కొహ్లీ, సురేష్ రైనా, రోహత్ శర్మ, గౌతం గంభీర్ ఉన్నారు.

    ఐపీఎల్లో అత్యధిక అర్ద సెంచరీలు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో కొహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ 184 మ్యాచ్‌ల్లో 176 ఇన్నింగ్స్ ఆడి.. 38 అర్ధ సెంచరీలు కొట్టాడు.

    ప్రస్తుత టోర్నీకి దూరంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌ల్లో 189 ఇన్నింగ్స్ ఆడిన రైనా.. 38 అర్ధ సెంచరీలు సాధించాడు.

    ఇక నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 195 మ్యాచ్‌ల్లో 190 ఇన్నింగ్ ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ కూడా 38 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

    కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ ఐదో స్థానంలో ఉన్నాడు. గంభీర్ 154 మ్యాచ్‌ల్లో 152 ఇన్సింగ్ ఆడి.. 36 హాఫ్ సెంచరీలు సాధించాడు.

    కాగా, ఐపీఎల్ ప్రారంభం సీజన్ (2008) నుంచి శిఖర్ ధావన్ అడుతున్నాడు. ఇప్పటి వరకు 167 మ్యాచ్‌లు ఆడిన గబ్బర్.. 4837 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో 39 అర్ధ సెంచరీలు చేసిన శిఖర్ ధావన్.. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేశాడు. ఇప్పటి వరకు 8 ఓవర్లు బౌలింగ్ వేసిన ధావన్.. 4 వికెట్లు పడగొట్టాడు.

    ఇక శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిట్స్ జట్టు ఈ టోర్నీలో అదరగొడుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన డీసీ జట్టు.. కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
    Published by:Shiva Kumar Addula
    First published: