ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ప్లే ఆఫ్‌లో ఆ నాలుగు జట్లు.. షేన్ వార్న్ ఆసక్తికర కామెంట్స్

ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ మెంటర్ షేన్ వార్న్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌ ప్లే ఆఫ్ చేరుకునే జట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

news18-telugu
Updated: October 1, 2020, 12:36 PM IST
IPL 2020: ప్లే ఆఫ్‌లో ఆ నాలుగు జట్లు.. షేన్ వార్న్ ఆసక్తికర కామెంట్స్
షేన్ వార్న్(Shane Warne)
  • Share this:
ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ మెంటర్ షేన్ వార్న్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌ ప్లే ఆఫ్ చేరుకునే జట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. టోర్నిలో ఇప్పటికి ఐపీఎల్ టోర్నీ ఆరంభ దశలోనే ఉన్నప్పటీకి.. ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకునే జట్లు ఇవేనంటూ అంచనా వేశాడు. రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లు ఈ సారి ఐపీఎల్ ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంటాయని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. ఇక, వార్నర్ చెప్పిన ఈ నాలుగు జట్లు కూడా సాధారణంగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివర్లో కనిపిస్తాయి.. కానీ ప్రసుత్తం పాయింట్స్ టేబుల్‌లో ఈ నాలుగు టాప్‌లో ఉన్నాయి.

ఇక, ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నిలో తిరిగి పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ''ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంటుందని అనకుంటున్నాను. వాళ్ల జట్టులో బ్యాలెన్సింగ్ ఉంది. అయితే నేను మాత్రం ఢిల్లీ కేపిటల్స్ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే ఢిల్లీ ఆటగాళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు.. అందుకే వారి ప్లే ఆఫ్‌లో నాలుగో స్థానంలో ఉంటారు" అని వార్నర్ తెలిపాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో 16 సిక్స్‌లు కొట్టిన సంజు శాంసన్ ఆటతీరు బాగా ఆకట్టుకుందని షేన్ వార్న్ తెలిపాడు. శాంసన్.. ఈ టోర్నిలో నిలకడగా రాణిస్తాడని నమ్ముతున్నట్టు చెప్పాడు. ఈ ఏడాది టోర్నిలో నిలకడగా రాణిస్తే.. ఇండియా తరఫు అన్ని ఫార్మాట్‌లలో ఆడే అవకాశం లబిస్తుందని అనుకుంటున్నట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. "శాంసన్ అద్భుతమైన ప్రతిభ ఆటగాడు. నా కాలంలో చాలా మంది ట్యాలెంటెడ్ క్రికెటర్లను చూశాను. కానీ కొన్నేళ్లుగా శాంసన్ బ్యాటింగ్‌ను నెట్స్‌లో చూడటం, అతని చుట్టూ ఉండటం, అతనితో మాట్లాడటం చేశాను. ఇప్పుడు అతను చాలా పరిణామం చెందాడు. అతను నా దృష్టిలో అతను చాలా ప్రత్యేకం" అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.
Published by: Sumanth Kanukula
First published: October 1, 2020, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading