SAKSHI DHONI: వాళ్లు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సూపర్‌ కింగ్స్‌ గానే ఉంటారు!

లీగ్ దశలోనే చెన్నై జట్టు ఐపీఎల్ నుంచి తప్పుకొవడంపై కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి సింగ్ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. "ప్రతి జట్టుకు గెలుపోటములు సహజం, సీఎస్‌కే ఎప్పటికే విజేతే!" అంటూ తన భావాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

news18-telugu
Updated: October 26, 2020, 3:20 PM IST
SAKSHI DHONI: వాళ్లు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సూపర్‌ కింగ్స్‌ గానే ఉంటారు!
సాక్షి సింగ్ ధోనీ (File)
  • Share this:


ధోనీ లాంటి సారథ్యుడి నేతృత్వంలో ఉన్న జట్టు.. అది కాక మూడు సార్లు ఐసీఎల్ టైటిల్ విజేతగా నిలవగా.. ఐదుసార్లు ఫైనల్‌కు చేరింది. మరో రెండు సార్లు ప్లేఆఫ్స్‌లో నిలిచింది. అలాంటి టీం ఇలా అర్ధాంతరంగా ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించడం అభిమానులను త్రీవంగా నిరాశపరుస్తోంది. ఆదివారం ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్‌ రాయల్స్ గెలవడంతో చెన్నై ఫ్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించినా ఫలితం లేకపోయింది.

అయితే లీగ్ దశలోనే చెన్నై జట్టు ఐపీఎల్ నుంచి తప్పుకొవడంపై కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి సింగ్ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. "ప్రతి జట్టుకు గెలుపోటములు సహజం, సీఎస్‌కే ఎప్పటికే విజేతే!" అంటూ తన భావాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. " ఆటలో అన్ని వేళలలో విజయం సాధ్యం కాదు. కొన్న సార్లు గెలుస్తారు,మరికొన్నింటిలో ఓడిపోతారు. ఇంకొన్ని చివరిలో చేజారిపోతాయి. అసాధరణ విజయాలు కొందరిని సందోషాన్ని మరికొందరికి బాధను మిగులుస్తాయి.ఇది కేవలం ఓ ఆట మాత్రం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుడాదు. అలాంటి సమయాలలో క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసే విషయాలకు ప్రాధన్యత ఇవ్వకూడదు. ఓటమిని ఎవరూ కోరుకోరు.. కానీ అందరూ విజేతలు కూడా అవ్వలేరు"









View this post on Instagram





💛


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on






"ఆట జరిగే సమయాలలో ఏర్పాడే ప్రతికూల వాతావారణాన్ని.. మనో ధైర్యంతో ఎదురించాలి!. జీవతంలో ఆట ఓ భాగం. గెలుపు కోసం ప్రయత్నించడమేలోనే విజేతగా నిలుస్తారు. వీరులకు యుద్ధం చేయడం ఓ లక్ష్యం.. అలాంటివారు ఎల్లప్పుడూ సూపర్‌ కింగ్స్‌‌గా వారిని అరాధించేవారి గుండెల్లో నిలిచిపోతారు." అంటూ తన భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉంది. ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. పాయిట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఎప్పుడూ లేనంతగా దారుణ పరిస్థితుల్లో ఉంది చెన్నై జట్టు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీతో పాటు తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ ఆటగాళ్లతో పాటు చెన్నై అభిమానులు కూడా మండిపడుతున్నారు.
Published by: Rekulapally Saichand
First published: October 26, 2020, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading