• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • IPL 2020 SACHIN TENDULKARS SON TO JOIN MUMBAI INDIANS FANS CURIOUS AFTER ARJUN SPOTTED IN CAMP SK

IPL 2020: ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ కుమారుడు అర్జున్? ఫొటోలు వైరల్

IPL 2020: ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ కుమారుడు అర్జున్? ఫొటోలు వైరల్

సచిన్ టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్

బీసీసీఐ SOP, నిబంధనల ప్రకారం.. టోర్నీ నుంచి ఎవరైనా తప్పుకుంటే యూఏఈలో ఉన్న ఇతర ఆటగాళ్లను ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీకి కల్పించారు.

  • Share this:
    IPL 2020: ఎల్లుండి నుంచి ఐపీఎల్ 2020 సందడి మొదలు కాబోతోంది. తొలి మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటగాళ్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఐతే టోర్నీ ఆరంభానికి 3 రోజుల ముందు ఐపీఎల్ గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్‌ను తీసుకున్నాడని.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని.. సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.

    అంతేకాదు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో సందడి చేస్తున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అర్జున్‌ బీసీసీఐ నిబంధనల ప్రకారం.. క్వారంటైన్ పూర్తి చేసుకొని ముంబై జట్టుతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమచారం. ముంబై ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్‌ ఫూల్‌లో కనిపించాడు అర్జున్. అందులో ఉన్న వారంతా బౌలర్లే కావడం గమనార్హం. ట్రెంట్ బోల్ట్, రాహుల్ చాహర్, జమేమ్స్ పాటిన్సన్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఫొటోలకు పోజులిచ్చాడు అర్జున్.

    అర్జున్ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు. అంతేకాదు 'రెస్ట్ డేస్ ఆర్ ది బెస్ట్' అని క్యాప్షన్ పెట్టాడు. ఐతే లెఫ్ట్ ఆర్మ బౌలింగ్ చేసే అర్జున్ ఐపీఎల్ 2020 వేలంలో పాల్గొనలేదు. మరి అలాంటప్పుడు ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో ఏం చేస్తున్నాడని.. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అర్జున్ గతంలోనూ ముంబై జట్టు క్యాంప్‌లో కనిపించాడు. బ్యాట్స్‌మెన్ నెట్స్ సాధనలో బౌలింగ్ చేస్తుంటాడు. ఈసారి కూడా నెట్ బౌలింగ్‌లో భాగంగానే ముంబై జట్టు అతడిని యూఏఈ తీసుకెళ్లిందని మరో చర్చ జరుగుతోంది.

    అలాగని ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్‌ టెండూల్కర్‌ను తీసుకోలేదని కూడా చెప్పలేం. జట్టు నుంచి ఎవరైనా ఆటగాళ్లు తప్పుకుంటే అర్జున్‌ను తీసుకునే అవకాశముంది. బీసీసీఐ SOP, నిబంధనల ప్రకారం.. టోర్నీ నుంచి ఎవరైనా తప్పుకుంటే యూఏఈలో ఉన్న ఇతర ఆటగాళ్లను ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీకి కల్పించారు. ఈ నేపథ్యంలో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్థానంలో ఆడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

    కాగా, అర్జున్ టెండూల్కర్ 2018లో భారత అండర్-19 జట్టు తరపున ప్రాతినధ్యం వహించాడు. తండ్రి సచిన్ టెండూల్కర్ బాటలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నాడు. మరి అర్జున్ ఈసారి ఐపీఎల్‌‌లో ఆడతాడా? లేదా? అనేది మరో రెండురోజుల్లోనే తెలియనుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ కోసం ఇటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్.. అటు సచిన్ ఫ్యాన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: