ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: సీఎస్‌కే ఓపెనర్లను ప్రశంసించిన సచిన్

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టు నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది.

news18-telugu
Updated: October 5, 2020, 1:12 PM IST
IPL 2020:  సీఎస్‌కే  ఓపెనర్లను ప్రశంసించిన సచిన్
డుప్లెసిస్, షేన్ వాట్సన్
  • Share this:
ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టు నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసంతో చెన్నై జట్టును విజేతగా నిలిపారు. ఐపీఎల్‌ ఆరంభలో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుని, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన చెన్నైని.. వాట్సన్ , డుప్లెసిస్ జోడి మళ్లీ గెలుపు పట్టాలెక్కించింది. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు వాట్సన్, డుప్లెసిస్ జోడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా చెన్నై విజయంపై స్పందించిన సచిన్.. వాట్సన్, డుప్లెసిస్ పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చాలా తేలికగా మర్చేసారని పేర్కొన్నాడు.

ఈ మేరకు ట్విటర్‌లో సచిన్ ఓ పోస్ట్ చేశాడు. "చెన్నై సంపూర్ణ విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్‌లు మంచి లక్ష్యాన్నే చెన్నై ముందు ఉంచారు. కానీ షేన్ వాట్సన్, డుప్లెసిస్ తమదైన బ్యాటింగ్‌తో ఆ లక్ష్యాన్ని చాలా తేలికగా చేధించారు. వెల్ డన్ సీఎస్‌కే" అని సచిన్ పేర్కొన్నాడు. ఇక, ఈ మ్యాచ్‌లో వాట్సన్, డుప్లెసిస్ 181 పరుగుల పాట్నర్‌షిప్‌తో చెన్నైని గెలిపించారు. వీరి పాట్నర్‌షిప్.. ఐపీఎల్‌లో చేజింగ్ చేసేటప్పుడు వికెట్ కోల్పోకుండా నెలకొల్పిన రెండో అతిపెద్ద భాగస్వామ్యంగా ఇది నిలింది. మరోవైపు ఐపీఎల్ ఇప్పటివరకు ఓపెనింగ్ జోడి నెలకొల్పిన నాలుగో అతిపెద్ద పాట్నర్‌షిప్‌గా రికార్డుల్లోకెక్కింది.



ఇక, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ 63, పూరన్ 33 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టు తొలి నుంచి దూకుడును ప్రదర్శించింది.



ఓపెనర్లు వాట్సన్ 83, డుప్లెసిస్ 87 పరుగులతో చెలరేగడంతో ఒక్క వికెటు కూడా నష్టపోకుండా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండానే 181 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది.
Published by: Sumanth Kanukula
First published: October 5, 2020, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading