RR vs SRH, IPL 2020: మనీశ్ పాండే మెరుపులు.. హైదరాబాద్ ఘన విజయం

RR vs SRH, IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం నాలుగింటిలో గెలిచింది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

RR vs SRH, IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం నాలుగింటిలో గెలిచింది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

  • Share this:
    IPL 2020: దుబయ్‌లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు డూ ఆర్ డై మ్యాచ్‌లో.. రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం సాధించింది. మనీష్ పాండే, విజయ్ శంకర్ మెరుపులు మెరిపించడంతో సునాయసంగా గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది. మనీష్ పాండే 47 బంతుల్లో 83 పరుగుల చేసి సత్తా చాటాడు. విజయ్ శంకర్ 51 బంతుల్లో 52 పరుగులు చేశాడు. బెయిర్ స్టో 10, వార్నర్ 4  రన్స్ మాత్రమే చేశారు. ఓపెనర్ల వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది హైదరాబాద్. మొదటి ఓవర్‌లోనే వార్నర్, మూడో ఓవర్లో బెయిర్ స్టో ఔటయ్యారు.  16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సన్‌రైజర్స్. ఐతే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే, విజయ్ శంకర్ అద్భుతమైన పార్ట్‌నర్‌షిప్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇద్దరు కలిసి ఏకంగా 140 పరుగులు జోడించారు.

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 36, బెన్ స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, స్మిత్ 19, ఊతప్ప 19 పరుగులు చేశారు. మొదట్లో మంచి జోష్ మీదున్న ఊతప్ప.. 4వ ఓవర్లో అనవసర పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్సన్.. బెన్‌స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12, 13 ఓవర్లలో సామ్సన్, స్టోక్స్ ఔట్ కావడంతో రాజస్థాన్ స్కోర్ నెమ్మదించింది. అనంతరం జోస్ బట్లర్ కూడా ఔట్ అయ్యారు. 19వ ఓవర్లో భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి.. హోల్డర్ బౌలింగ్‌లో స్మిత్, రియాన్ పరాగ్ పెవిలియన్ చేరారు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో.. జాసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ఆడిన హోల్డర్.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి.. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. ఇక నటరాజన్ ఎక్కువ పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు.

    కాగా, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 13 సార్లు తలపడ్డాయి. హైదరాబాద్ 7 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్థాన్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు అక్టోబరు 11న దుబాయ్ వేదికగా హైదరాబాద్, కోల్‌కతా ఢీకొన్నాయి. ఆ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది వార్నర్ సేన. అంతేకాదు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం నాలుగింటిలో గెలిచింది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా..4 మాత్రమే గెలిచింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలయింది. 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది స్మిత్ సేన. శుక్రవారం షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: