Home /News /ipl /

IPL 2020 RR VS SRH LIVE CRICKET SCORE RAJASTHAN ROYALS VS SUNRISERS HYDERABAD WARNER RR SCORES 154 RUNS SK

RR vs SRH, IPL 2020 Live Score: రాజస్థాన్ డీసెంట్ స్కోర్.. హైదరాబాద్ గెలిచేనా?

రాజస్థాన్ బ్యాటింగ్ (Image:IPL)

రాజస్థాన్ బ్యాటింగ్ (Image:IPL)

IPL 2020, Rajasthan Royals vs Sunrisers Hyderabad Live Score: ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ఆడిన హోల్డర్.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి.. కీలకమైన మూడు వికెట్లు తీశాడు.

    RR vs SRH, IPL 2020 Live Score: ఐపీఎల్ 2020లో ఇవాళ 40వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 36, బెన్ స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, స్మిత్ 19, ఊతప్ప 19 పరుగులు చేశారు. మొదట్లో మంచి జోష్ మీదున్న ఊతప్ప.. 4వ ఓవర్లో అనవసర పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్సన్.. బెన్‌స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12, 13 ఓవర్లలో సామ్సన్, స్టోక్స్ ఔట్ కావడంతో రాజస్థాన్ స్కోర్ నెమ్మదించింది. అనంతరం జోస్ బట్లర్ కూడా ఔట్ అయ్యారు. 19వ ఓవర్లో భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి.. హోల్డర్ బౌలింగ్‌లో స్మిత్, రియాన్ పరాగ్ పెవిలియన్ చేరారు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో.. జాసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ఆడిన హోల్డర్.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి.. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. ఇక నటరాజన్ ఎక్కువ పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు.

    కాగా, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 12 సార్లు తలపడ్డాయి. చెరో ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే సమ ఉజ్జీలుగా ఉన్నాయన్నమాట. ఈ టోర్నీలో ఇంతకు ముందు అక్టోబరు 11న దుబాయ్ వేదికగా హైదరాబాద్, కోల్‌కతా ఢీకొన్నాయి. ఆ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకొని.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని సన్ రైజర్స్‌ భావిస్తోంది. మరోసారి హైదరాబాద్‌ను ఓడించి.. ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లాలని రాజస్థాన్ కూడా పట్టుదలతో ఉంది.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. రాజస్థాన్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ టీమ్..4 గెలిచింది. మరో ఆరింట పరాజయం పాలయింది. 8 పాయింట్లతో ఆరో స్థానలో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Rajasthan Royals, Sun risers hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు