ఆరేళ్ల తర్వాత 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న స్టార్ బాట్స్‌మెన్.. మరో రికార్డు కూడా..

మనీష్ పాండే (Image: IPL/Twitter)

మనీష్ అద్భుత ఇన్నింగ్స్‌తో 47 బంతుల్లో 83 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడ సర్‌ప్రైజ్ కావాల్సిన విషయం ఏమిటంటే

 • Share this:
  వరుస పరజయాలతో కాస్త అభిమానులకు నిరుత్సాహపరిచిన సన్‌రైజర్స్ గురువారం రాజస్థాన్‌కు జరిగిన మ్యాచ్‌లో అపూర్వ విజయాన్ని అందుకుంది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడగా, విజయ్‌ శంకర్‌ (51 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) దాటి ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టికేలకు విజయం సాధించింది. వీరిద్దరు కలిసి 93 బంతుల్లోనే  140 పరుగులు భాగసామ్యాన్ని నమోదు చేశారు. వీరి దాటి ఇన్నింగ్స్ కారణంగా 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే చేధించింది

  పన్‌రైజర్స్. ఈ విజయంతో మళ్ళీ ఫ్లే ఆఫ్ రేసులోకి వచ్చేసింది ఎస్‌ఆర్‌హెచ్.  ఈ మ్యాచ్‌లో గెలవడం వెనుక క్రెడిట్ మాత్రం మనీష్ పాండేకు ఇవ్వాల్సిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో 47 బంతుల్లో 83 పరుగులు చేసి  'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడ సర్‌ప్రైజ్ కావాల్సిన విషయం ఏమిటంటే ఆరేళ్ల తరువాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాండే అందుకోవడం.. అలాగే మరో ఘనతను కూడా సాధించారు మనీష్. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా, యూఏఈలో వేదికలుగా ఐపీఎల్ జరిగిన విషయం తేలిసిందే. ఈ మూడు వేదికలలో రోహిత్, రైనాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు వారి సరసన పాండ్యా కూడా చేరాడు. మూడు దేశాల్లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.

  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 36, బెన్ స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, స్మిత్ 19, ఊతప్ప 19 పరుగులు చేశారు. తర్వాత ఛేధనకు దిగిన సన్‌రైజర్స్‌.. రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం సాధించింది. మనీష్ పాండే, విజయ్ శంకర్ మెరుపులు మెరిపించడంతో సునాయసంగా గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది
  Published by:Rekulapally Saichand
  First published: