RR vs DC: ఢిల్లీ,రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.. రాయల్స్ జట్టులో కీలక మార్పులు

dc vs rr
ఐపీఎల్ 13 వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) శుక్రవారం షార్జాలో తలపడనున్నాయి. వరుసగా మూడు ఓటములతో రాజస్థాన్ రాయల్స్ పై ఒత్తిడి ఉంది.

ఐపీఎల్ 13 వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) శుక్రవారం షార్జాలో తలపడనున్నాయి. వరుసగా మూడు ఓటములతో రాజస్థాన్ రాయల్స్ పై ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి మళ్ళీ విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని ఊవ్విలూరుతోంది. ఈ ఢిల్లీ వరుస విజయాలతో దూసుకపోతు మరో విజయాన్ని కూడా తన ఖాతలో వేసుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 నుండి షాజా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది.

మెుదటి రెండు మ్యాచ్‌ల్లో ఇరగదీసిన రాయల్స్ ఆ తర్వాత ఫేలవ పదర్శనను కనబరించింది. ముఖ్యంగా తుది జట్టు ఎంపికలో ఇబ్బందులు పడుతూనే ఉంది. ఆరంభంలో అదరగొట్టిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ తర్వాత అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుండం జట్టుకు ప్రతికూలంశంగా మారింది.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ప్రయోగాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్, పేసర్ కార్తీక్ త్యాగి, అంకిత్ రాజ్‌పుత్‌ను తుది జట్టులోకి తీసుకున్నా జట్టు రాత మారలేదు. ముంబై జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ ఫామ్‌లోకి వచ్చారు. మిగితా బాట్స్మెన్స్ కూడా రాణిస్తే ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉంటుంది.

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్నర్ తెవాటియా విఫలమవుతున్నాడు. ముంబైతో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. టామ్ కరన్ ప్లేస్‌లో డేవిడ్ మిల్లర్‌కు అవకాశం రావచ్చు.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే బ్యాటింగ్‌లో చాలా బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ అయ్యర్ సూపర్ ఫామ్‌తో ఆడుతుండగా, ఓపెనర్ పృథ్వీషా, రిషభ్ పంత్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

బౌలింగ్‌లోనూ ఢిల్లీకి బలంగానే కనిపిస్తోంది. రబడా మంచి లైన్ ఆండ్ లెన్త్‌తో రాణిస్తుండగా.. నోర్జ్ కూడా మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. లోకల్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా సత్తా చాటుతున్నాడు. సీనియర్ స్పీన్నర్ అశ్విన్ చేరికతో లైనప్ మరింత బలంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మార్పులు చేసే అవకాశం లేదు.
Published by:Rekulapally Saichand
First published:October 09, 2020, 16:48 IST