ఐపీఎల్ 2020

  • associate partner

Mohammed Siraj: సిరాజ్ రికార్డుల మోత.. ఒక్క మ్యాచ్‌తో సరికొత్త చరిత్ర

Mohammed Siraj: ఐపీఎల్ 2020 టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు వికెట్లు ఈ మ్యాచ్‌లో తీసినవే కావడం విశేషం.

news18-telugu
Updated: October 21, 2020, 10:51 PM IST
Mohammed Siraj: సిరాజ్ రికార్డుల మోత.. ఒక్క మ్యాచ్‌తో సరికొత్త చరిత్ర
మహమ్మద్ సిరాజ్ (Image:IPL)
  • Share this:
అబుదాబిలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసిరి కోల్‌కతాను కకావికలం చేశాడు. 4-2-8-3. ఇదీ సిరాజ్ స్పెల్..! అంటే నాలుగు ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రెండు మెయిడెన్ ఓవర్లు కూడా వేశారు. మొత్త 4 ఓవర్లలో 16 డాట్ బాల్స్ ఉన్నాయి. ఒక్క బౌండరీ కూడా వేయలేదు. తాను వేసిన మొదటి రెండు ఓవర్లలో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. తన మొదటి ఓవర్ మూడో బంతికి రాహుల్ త్రిపాఠిని ఔట్ చేశాడు. ఆ నెక్ట్స్ బంతికే నితీష్ రాణాను కూడా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ వేసిన సిరాజ్.. మరోసారి కేకేఆర్‌పై విరుచుకుపడ్డాడు. మూడో బంతికి టామ్ బాటన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మూడు వికెట్లలో రెండు క్యాచ్‌లు కీపర్ డివిలియర్స్ క్యాచ్ పట్టగా.. రాణాను మాత్రం క్లీన్ బౌల్ట్ చేశాడు.


సిరాజ్ రికార్డులు:

1. ఐపీఎల్ చరిత్రలో ఓక మ్యాచ్‌లో రెండు ఓవర్లను మెయిడిన్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

2. తన బౌలింగ్‌లో ఒక పరుగు ఇవ్వడానికి ముందు మూడు వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్

3. ఒక పరుగు ఇవ్వడానికి అత్యధిక డాట్ బాల్స్ (12 డాట్ బాల్స్) వేసిన బౌలర్ మహమ్మద్ సిరాజ్.


అంతేకాదు సిరాజ్ దెబ్బకు  కోల్‌కతా నైట్ రైడర్స్ ఎన్నో చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌కే.. మొదటి మూడు వికెట్లు కోల్పోయిన జట్ల జాబితాలో కేకేఆర్ చేరిపోయింది.

తక్కువ స్కోర్‌కే మొదటి 3 వికెట్లు కోల్పోయిన జట్లు:

1/3 దక్కన్ చార్జర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ఈస్ట్ లండన్, 2009)
1/3 కొచ్చి టస్కర్స్ కేరళ vs దక్కన్ చార్జర్స్ (కొచ్చి, 2011)
3/3 రాజస్థాన్ రాయల్స్ vs దక్కన్ చార్జర్స్ (పోర్ట్ ఎలిజబెత్, 2009)
3/3 చెన్నై సూపర కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (కోల్‌కతా, 2013)3/3 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (అబుదాబి, 2020)

అంతేకాదు ఐపీఎల్ 2020లో అతి తక్కువ పవర్ ప్లే స్కోర్ ( మొదటి ఆరు ఓవర్లు) చేసిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టుకు అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం.

2020లో 'తక్కువ పవర్ ప్లే' స్కోర్లు:

17/4 KKR v RCB (అబుదాబి)
23/3 DC v KXIP (దుబాయ్)
25/2 KKR v KXIP (అబుదాబి)
26/2 CSK v RCB (దుబాయ్)
26/1 SRH v RR (దుబాయ్)

ఐపీఎల్ 2020 టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు వికెట్లు ఈ మ్యాచ్‌లో తీసినవే కావడం విశేషం.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading