హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Jio IPL Special Dhan Dhana Dhan prepaid plans | జియో యూజర్లకు గుడ్ న్యూస్. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ప్లాన్స్ ఉచితంగా అందించే ప్లాన్స్‌ని ప్రకటించింది జియో.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలనుకునే క్రికెట్ ఫ్యాన్స్ కోసం రిలయెన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. 'ధన్ ధనా ధన్' పేరుతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని పరిచయం చేసింది. రూ.499, రూ.777 ధరతో ఈ ప్లాన్స్ ఉన్నాయి. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ లవర్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఈ ప్లాన్స్‌ని రూపొందించింది రిలయెన్స్ జియో. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసిన వారికి డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. కాబట్టి ఐపీఎల్ ఫ్యాన్స్ ఉచితంగానే అన్ని క్రికెట్ మ్యాచ్‌లు చూడొచ్చు. ఈ రెండు ప్లాన్స్‌లో బెనిఫిట్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. మరి రూ.499, రూ.777 ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.

Govt Scheme: జాబ్ పోయిందా? అయినా సగం జీతం తీసుకోవచ్చు... అప్లై చేయండిలా

LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందండి ఇలా

రూ.499 రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఇది కేవలం డేటా టాప్ అప్ ప్లాన్. ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఇది వర్తిస్తుంది. రూ.499 రీఛార్జ్ చేస్తే రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. అంటే 56 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 84జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు. అంటే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ప్లాన్‌కు అదనంగా రూ.100 చెల్లిస్తే చాలు 56 రోజులు డేటా లభిస్తుంది.

EPFO KYC: మీ ఈపీఎఫ్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండిలా

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?

ఇక రూ.777 రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. అదనంగా మరో 5జీబీ డేటా కూడా పొందొచ్చు. అంటే మొత్తం 131జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌కు కూడా రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చే ప్లాన్స్ జియోలో ఉన్నాయి. రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజుకు 3జీబీ చొప్పున 28 రోజుల పాటు 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 1000 నిమిషాలు మాట్లాడొచ్చు. రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ చొప్పున 365 రోజులకు 730జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 12000 నిమిషాలు మాట్లాడొచ్చు. ఈ రెండు ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

First published:

Tags: Cricket, Disney+ Hotstar, Hotstar, IPL, IPL 2020, Jio, Reliance Jio

ఉత్తమ కథలు