Home /News /ipl /

IPL 2020 RCB VS SRH LIVE CRICKET SCORE ROYAL CHALLENGERS BANGALORE VS SUNRISERS HYDERABAD VIRAT KOHLI TEAM SCORE 120 SK

RCB vs SRH, IPL 2020: బౌలర్ల ప్రతాపం.. బెంగళూరును కట్టడిచేసిన హైదరాబాద్

సందీప్ శర్మ (Image:IPL)

సందీప్ శర్మ (Image:IPL)

RCB vs SRH, IPL 2020: హైదరాబాద్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

    RCB vs SRH, IPL 2020: షార్జాలో హైదరాబాద్ బౌలర్లు బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. కీలకమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తక్కువ పరుగులకే పరిమితం చేశారు. కొహ్లీ సేనను లో స్కోర్‌కే కట్టడి చేసి.. ప్లేఆఫ్స్ ఆశలను పెంచుకుంది సన్‌రైజర్స్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. జోష్ ఫిలిప్పి 32, ఏబీ డివిలియర్స్ 24, వాషింగ్టన్ సుందర్ 21, గుర్‌కీరట్ 15 పరుగులు చేశారు. దేవదత్ పడిక్కల్ 5, విరాట్ కొహ్లీ 7, క్రిస్ మోరిస్ 3 పరుగలే చేసి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. మూడో ఓవర్లోనే దేవదత్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో కొహ్లీ ఔట్ అవడంతో బెంగళూరుకు పెద్ద దెబ్బ పడింది. అనంతరం ఫిలిప్పి, డివిలియర్స్  42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 71 పరుగుల వద్ద డివిలియర్స్, 76 పరుగుల వద్ద ఫిలిప్పి ఔట్ కావడంతో స్కోర్ వేగం మందగించింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో బెంగళూరు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    హైదరాబాద్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్, షాబాద్ నదీమ్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు. వీరిలో నటరాజన్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు.


    ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆర్సీబీ 7 సార్లు విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్‌లో గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 21న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి RCB పై ప్రతీకారం తీర్చుకొని.. ప్లేఆఫ్స్ పోరులో నిలవాలని SRH భావిస్తోంది. మరోసారి వార్నర్‌ సేనను ఓడించి.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది విరాట్ సేన.
    POINTS TABLE:

    ORANGE CAP:

    PURPLE CAP:
    కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ 12 మ్యాచ్‌లు ఆడాయి. బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో ఐదింటిలో ఓడిపోయింది. 14 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఏడు ఓడిపోయింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌పై ఆశలు పెట్టుకోవాలంటే ఇవాళ్టి మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Royal Challengers Bangalore, Sun risers hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు