RCB vs SRH, IPL 2020: ఐపీఎల్ టోర్నీలో 52వ మ్యాచ్ జరుగుతోంది. షార్జా వేదిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. SRH ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా తప్పుకున్న విజయ్ శంకర్ స్థానంలో వృద్దిమాన్ సాహా జట్టులోకి వచ్చాడు. ఇక బెంగళూరులో రెండు మార్పులు చేశారు. శివం దుబే స్థానంలో నవదీప్ శైని, స్టెయిన్ స్థానంలో ఇసురు ఉదానాను జట్టులోకి తీసుకున్నారు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆర్సీబీ 7 సార్లు విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్‌లో గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 21న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి RCB పై ప్రతీకారం తీర్చుకొని.. ప్లేఆఫ్స్ పోరులో నిలవాలని SRH భావిస్తోంది. మరోసారి వార్నర్ సేనను ఓడించి.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది విరాట్ సేన.
POINTS TABLE:
ORANGE CAP:
PURPLE CAP:
కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ 12 మ్యాచ్‌లు ఆడాయి. బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో ఐదింటిలో ఓడిపోయింది. 14 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఏడు ఓడిపోయింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌పై ఆశలు పెట్టుకోవాలంటే ఇవాళ్టి మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.