ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs SRH, IPL 2020: గెలిచారు.. నిలిచారు.. ప్లేఆఫ్స్ రేస్‌లో సన్‌రైజర్స్

IPL 2020: ఇవాళ్టి మ్యాచ్‌లో గెలుపుతో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చింది హైదరాబాద్. పంజాబ్, కోల్‌కతా, రాజస్థాన్‌కు కూడా 12 పాయింట్లే ఉన్నప్పటికీ.. నెట్‌రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో.. సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి చేరింది.

news18-telugu
Updated: October 31, 2020, 11:10 PM IST
RCB vs SRH, IPL 2020: గెలిచారు.. నిలిచారు.. ప్లేఆఫ్స్ రేస్‌లో సన్‌రైజర్స్
మనీష్ పాండే (Image:IPL)
  • Share this:
RCB vs SRH, IPL 2020: షార్జాలో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి ప్లేఆఫ్స్ రేస్‌లో నిలిచింది. పాయింట్ల పట్టికలో ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది. 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాట్స‌్‌మెన్ కాస్త కష్టపడుతూనే చేధించారు. 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి బెంగళూరును ఓడించింది సన్‌రైజర్స్. వృద్ధిమాన్ సాహా 39, జేసన్ హోల్డర్ 26, మనీష్ పాండే 26 పరుగులు చేశారు. వార్నర్ 8, విలియమ్సన్ 8, అభిషేక్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. ఆరంభంలోనే తడబడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ వార్నర్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండేతో కలిసి సాహా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 60 పరుగుల వద్ద మనీష్, 82 వద్ద సాహా, 87 వద్ద విలియమ్సన్ ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. ఐతే అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ ఔటైనప్పటికీ.. ధాటికి ఆడి జట్టును గెలిపించాడు హోల్డర్. ఈ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కేవలం 10 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. సుందర్, సైని, ఉదానా తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తక్కువ పరుగులకే పరిమితం చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. జోష్ ఫిలిప్పి 32, ఏబీ డివిలియర్స్ 24, వాషింగ్టన్ సుందర్ 21, గుర్‌కీరట్ 15 పరుగులు చేశారు. దేవదత్ పడిక్కల్ 5, విరాట్ కొహ్లీ 7, క్రిస్ మోరిస్ 3 పరుగలే చేసి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. మూడో ఓవర్లోనే దేవదత్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో కొహ్లీ ఔట్ అవడంతో బెంగళూరుకు పెద్ద దెబ్బ పడింది. అనంతరం ఫిలిప్పి, డివిలియర్స్ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 71 పరుగుల వద్ద డివిలియర్స్, 76 పరుగుల వద్ద ఫిలిప్పి ఔట్ కావడంతో స్కోర్ వేగం మందగించింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో బెంగళూరు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.

హైదరాబాద్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్, షాబాద్ నదీమ్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు. వీరిలో నటరాజన్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 16 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆర్సీబీ 7 సార్లు విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 21న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి RCB పై ప్రతీకారం తీర్చుకొని.. ప్లేఆఫ్స్ పోరులో నిలిచింది SRH.
POINTS TABLE:


SCHEDULE TIME TABLE:


ORANGE CAP:

PURPLE CAP:


కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ 13 మ్యాచ్‌లు ఆడాయి. బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో ఆరింటిలో ఓడిపోయింది. 14 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలుపుతో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చింది హైదరాబాద్. పంజాబ్, కోల్‌కతా, రాజస్థాన్‌కు కూడా 12 పాయింట్లే ఉన్నప్పటికీ.. నెట్‌రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో.. సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి చేరింది.
Published by: Shiva Kumar Addula
First published: October 31, 2020, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading