ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs KXIP, IPL 2020 Live Score: టాస్ గెలిచిన కొహ్లీ సేన.. పంజాబ్ జట్టులో గేల్

IPL 2020, Royal Challengers Bangalore vs Kings XI Punjab Live Score: ఈ సీజన్‌తో క్రిస్ గేల్‌కు ఇదే మొదటి మ్యాచ్. మరి తన పాత టీమ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై గేల్ ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది.

news18-telugu
Updated: October 15, 2020, 7:14 PM IST
RCB vs KXIP, IPL 2020 Live Score: టాస్ గెలిచిన కొహ్లీ సేన.. పంజాబ్ జట్టులో గేల్
విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ (Image:IPL)
  • Share this:
RCB vs KXIP, IPL 2020: ఐపీఎల్‌లో నేడు 31వ మ్యాచ్ జరుగుతోంది. షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. బెంగళూరు జట్టు ఎలాంటి మార్పు లేకుండా.. సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. పంజాబ్ జట్టు మూడు మార్పులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ఓసారి తలపడ్డాయి. ఇది రెండో మ్యాచ్. గాయంతో మన్‌దీప్ తప్పుకున్నాడు. ఇక ప్రబ్ సిమ్రాన్, ముజీబ్‌ను పక్కనబెట్టారు. వీరి స్థానాల్లో గేల్, మురుగన్ అశ్విన్, దీపక్ హుడా జట్టులోకి వచ్చారు. ఈ సీజన్‌తో క్రిస్ గేల్‌కు ఇదే మొదటి మ్యాచ్. మరి తన పాత టీమ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై గేల్ ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది.

జట్ల వివరాలు:

Kings XI Punjab (Playing XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మయాంగ్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

Royal Challengers Bangalore (Playing XI): విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉడానా, నవదీప్ సైని, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఈ టోర్నీలో ఇప్పటికే ఓసారి ఇరు జట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 24న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై పంజాబ్ విజయం సాధించింది. ఆ రోజు పంజాబ్ జట్టు 206 స్కోర్ చేసి.. 97 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో పంజాబ్ టీమ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మూడో స్థానంలో ఉంది. పంజాబ్ టీమ్ అట్టడుగున నిలిచింది. కొహ్లీ సేన ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. మరో రెండు ఓడిపోయింది. పంజాబ్ టీమ్ కూడా ఏడు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒకే ఒక్కటి గెలిచింది. అది కూడా బెంగళూరుపైనే విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌లు ఓటమి పాలయింది.
Published by: Shiva Kumar Addula
First published: October 15, 2020, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading